టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఎవర్గ్రీన్ హీరోయిన్ గా పేరు సంపాదించుకుంది అంజలి. ఎప్పుడు విభిన్నమైన సినిమాలలో చేస్తూ తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గర అయింది. కేవలం తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా అనేక సినిమాల్లో నటించి భారీగా భారీగా గుర్తింపు తెచ్చుకుంది. ఒకప్పుడు హీరోయిన్గా పలు సినిమాల్లో చేసిన ఈమె ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది. ప్రస్తుతం సెకండ్ హీరోయిన్ లేడీ ఓరియంటెడ్ సినిమాలో చేస్తూ గా ఉంది. ప్రస్తుతం ఈ బ్యూటీ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ చేంజర్

 సినిమాలో నటిస్తోంది. అలాగే విశ్వక్సేన్ హీరోగా నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలో సైతం నటించింది. అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ లో పాల్గొంటుంది. అంజలి. అందులో భాగంగానే పలు ఆసక్తికరమైన విషయాలను అభిమానులతో పంచుకుంది. అయితే ఈ సినిమా కోసం ఆమె మొట్టమొదటిసారిగా బూతులు మాట్లాడాల్సి వచ్చింది అంటూ ఆ ప్రమోషన్స్ లో భాగంగా తెలిపింది. అయితే ఈ సినిమాలో రత్నమాల అనే పాత్రలో నటించాను అని.. ఇప్పటివరకు తాను నటించిన అన్ని పాత్రల కంటే ఈ

 సినిమాలో తన పాత్ర చాలా భిన్నంగా ఉంటుంది అని చెప్పింది. అంతేకాదు తను ఒక సినిమాలో బూతులు మాట్లాడడం ఇదే మొట్టమొదటిసారి అని చెప్పింది. ఇదే విషయాన్ని తన క్యారెక్టర్ కి డబ్బింగ్ చెప్పే సమయం కూడా తన టీం కి చెప్పినట్లుగా తెలిపింది. దాంతో పాటు బయట కూడా అసలు తన వ్యక్తిత్వం ఇలా ఉండదు అని.. ఎక్కువగా బూతులు అసలు మాట్లాడను అంటూ తెలిపింది. అలాంటిది రత్నమాల పాత్ర కోసం చేసినట్లుగా చెప్పింది. ఇక రత్నమాల పాత్ర కోసం డైరెక్టర్ తనను కలిసినప్పుడు చాలా ఆశ్చర్యంగా అనిపించింది అని వెల్లడించింది. ఆ తర్వాత డైరెక్టర్ మాట్లాడుతూ.. ఇప్పటికే అంజలి అన్ని పాత్రల్లో నటించి ఆరి తేరింది. ఎలాంటి పాత్రనైనా చేయగల టాలెంట్ తన దగ్గర ఉంది.. అందుకే ఈ పాత్ర కోసం అంజలి అయితే పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది అని ఈ సినిమాలో తనని సెలెక్ట్ చేసుకున్నాము అని డైరెక్టర్ కృష్ణ చైతన్య చెప్పుకొచ్చాడు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: