తెలుగు సినీ పరిశ్రమలో నటుడుగా మంచి గుర్తింపును సంపాదించుకున్న గెటప్ శీను తాజాగా రాజు యాదవ్ అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ ని మే 24 వ తేదీన థియేటర్ లలో విడుదల చేశారు. ఈ సినిమా విడుదలకు ముందు మేకర్స్ ఈ మూవీ నుండి విడుదల చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ సినిమా ట్రైలర్ ప్రకారం శీను క్రికెట్ ఆడుతూ ఉండగా అనుకోకుండా క్రికెట్ బంతి వచ్చి అతని మొహానికి తాకుతుంది. దానితో అతనికి గాయం అవుతుంది. 

అతన్ని హాస్పటల్ లో చేర్చగా డాక్టర్స్ ఇతనికి తగిలిన గాయం వల్ల ఇతను ఎప్పుడూ నవ్వుతూ ఉన్నట్లే అతని మొహం ఉంటుంది. ఇది పోవాలి అంటే ఇతనికి సర్జరీ చేయాలి. అందుకు చాలా డబ్బు ఖర్చు అవుతుంది అని డాక్టర్స్ చెబుతారు. శ్రీను వాళ్ళ ఇంట్లో వాళ్ళను ఆపరేషన్ కోసం డబ్బు ఇవ్వమని అడగడం , వాళ్లు కూతురు పెళ్లి కోసం డబ్బు దాచాను దానికే వాడతాను నీకు ఇవ్వను అని చెప్పడం , ఇలా కొన్ని పరిస్థితుల వల్ల వారి కుటుంబంలో గొడవలు జరుగుతాయి ఇలా ట్రైలర్ ముందుకు సాగింది. ఈ ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో ఈ సినిమాపై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు.

ఇకపోతే మే 24 వ తేదీన విడుదల అయిన ఈ సినిమా ప్రస్తుతం ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటుంది. ఇకపోతే తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభిస్తుంది అని దానితో కొన్ని ఎక్స్ట్రా థియేటర్స్ ను కూడా యాడ్ చేశాము అని తెలియజేస్తూ ఓ పోస్టర్ ను విడుదల చేశారు. ఇకపోతే ఈ సినిమాకి కృష్ణమాచారి దర్శకత్వం వహించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: