తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన గుర్తింపు ఉన్న నిర్మాతలలో దిల్ రాజు ఒకరు. ఈయన ఇప్పటి వరకు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ఎన్నో సినిమాలను నిర్మించి అందులో చాలా మూవీ లతో బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకొని తెలుగు సినీ పరిశ్రమలో నిర్మాతగా తనకంటూ ఒక అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక ఈయన కెరియర్ ప్రారంభం అయ్యి చాలా సంవత్సరాలు అవుతున్న ఈయనకు ఎవరితో గొడవలు ఉండవు. షూటింగ్ లో కూడా చాలా ప్రశాంతంగా ఉంటాడు అనే పేరు ఉంది.

కానీ ఇంత ప్రశాంతత కలిగిన దిల్ రాజు ఓ సినిమా షూటింగ్ లో స్పాట్ లో ఫుల్ ఫైర్ అయ్యి ఒక చైర్ ను విసర గొట్టి వెళ్లిపోయాడు. అసలు అలా ఎందుకు జరిగింది. ఆయనకు ఎందుకు అంతలా కోపం వచ్చింది అనే విషయాలను ఆయనే తాజాగా ఓ ఇంటర్వ్యూ లో భాగంగా చెప్పుకొచ్చాడు. తాజా ఇంటర్వ్యూ లో భాగంగా దిల్ రాజు మాట్లాడుతూ ... ఆశిష్ హీరో గా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా రౌడీ బాయ్స్ అనే  సినిమా రూపొందింది. ఇక ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న చోటికి ఒక రోజు నేను వెళ్లాను. ఇక నేను వెళ్ళిన రోజు అక్కడ దాదాపు 1,000 మంది జూనియర్ ఆర్టిస్ట్ లతో ఒక సీన్ చేయవలసి ఉంది.

జూనియర్ ఆర్టిస్టులు వెయ్యి మంది ఉన్నారు. కానీ వారి మధ్య కో ఆర్డినేషన్ లేకుండా ఎవరికి ఇష్ట మొచ్చినట్టు వాళ్ళు చేస్తున్నారు. దానితో నాకు కోపం వచ్చింది. వెంటనే నా దగ్గర ఉన్న కుర్చీ నీ తీసి నేలకు విసిరాను. దెబ్బకు అది ముక్కలు అయింది. అలా రౌడీ బాయ్స్ సినిమా షూటింగ్ లో భాగంగా నాకు తీవ్రమైన కోపం వచ్చింది అని దిల్ రాజు చెప్పుకొచ్చాడు. ఇకపోతే రౌడీ బాయ్స్ సినిమాలో హీరోగా నటించిన ఆశిష్ , దిల్ రాజు సోదరుడి కుమారుడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్ విజయాన్ని అందుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Dr