ఈ మధ్య కాలంలో విడుదల తేదీలను ప్రకటించిన చాలా సినిమాలు పోస్ట్ పోన్ అవుతున్నాయి. కొన్ని రోజుల క్రితం రాజు యాదవ్ అనే సినిమాను సడన్ గా పోస్ట్ పోన్ చేసి మే 24 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అందులో భాగంగా ఈ సినిమాను మే 24 వ తేదీన విడుదల చేశారు. ఇకపోతే టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ కలిగిన నటి మణులతో ఒకరు అయినటువంటి కాజల్ అగర్వాల్ తాజాగా సత్యభామ అనే లేడీ ఓరియంటెడ్ మూవీ లో హీరోయిన్ గా నటించిన విషయం మన అందరికీ తెలిసింది. 

మూవీ ని మే 31 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ చాలా రోజుల క్రితమే ప్రకటించారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ కి సంబంధించిన ప్రమోషన్ లను కూడా నిర్వహించారు. ఇలా ఈ సినిమా ప్రమోషన్ లను ఓ వైపు చేస్తూనే సడన్ గా ఈ మూవీ యొక్క విడుదల తేదీని మార్చేశారు. ఈ సినిమాను మే 31 వ తేదీన కాకుండా జూన్ 7 వ తేదీన విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఇకపోతే మే 31 వ తేదీన విడుదల కావాల్సిన మరో సినిమా కూడా తాజాగా విడుదల పడింది. ఇక కొత్త విడుదల తేదీని కూడా మేకర్స్ తాజాగా ప్రకటించారు.

అజయ్ ఘోష్ , చాందిని చౌదరి ప్రధాన పాత్రల్లో శివ పలడుగు దర్శకత్వంలో మ్యూజిక్ షాప్ మూర్తి అనే మూవీ రూపొందిన విషయం మనకు తెలిసిందే. ఇకపోతే ఈ సినిమాను మేకర్స్ కొన్ని రోజుల క్రితం మే 31 వ తేదీన విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అందుకు తగినట్లుగా ప్రచారాలను కూడా చేశారు. ఇక తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాను మే 31 వ తేదీన కాకుండా జూన్ 14 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ప్రస్తుతం ఆ పోస్టర్ వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Cc