టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో కామెడీ ఓరియంటెడ్ సినిమాలను తెరకెక్కించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు దివంగత దర్శకుడు ఈవీవి సత్యనారాయణ. అయితే ఆయన వారసుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన నరేష్ ఇక ప్రేక్షకులకు ఎంతలా దగ్గరయ్యాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అల్లరి అనే మూవీతో ప్రస్తానాన్ని మొదలుపెట్టి సినిమా పేరునే తన ఇంటి పేరుగా మార్చేసుకున్నాడు అల్లరి నరేష్. ఇక ఆ తర్వాత ఎన్నో కామెడీ ఓరియంటెడ్ సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు.


 ప్రేక్షకులు అందరిని కూడా తన కామెడీ టైమింగ్ తొ కడుపుబ్బ నవ్వించడంలో సక్సెస్ అయిన అల్లరి నరేష్.. ఎన్నో ఏళ్ల పాటు కామెడీ స్టార్ గానే కొనసాగాడు. కానీ ఆ తర్వాత కాలంలో బుల్లితెరపై ఎన్నో కామెడీ షోస్ రావడంతో అల్లరి నరేష్ మూవీస్ పెద్దగా ప్రేక్షకులకు కనెక్ట్ కాలేదు. దీంతో కామెడీ సినిమాలను  వదిలేసి డిఫరెంట్ ఓరియెంటెడ్ సినిమాలు చేయడం మొదలుపెట్టాడు. ఇక వైవిద్యమైన పాత్రలో నటిస్తూ తనలోని నటుడిని ప్రేక్షకులకు పరిచయం చేశాడు. అయితే ఇలా వైవిధ్యమైన సినిమాలు చేస్తున్న తరుణంలోనే మళ్లీ మరోసారి కామెడీ ట్రాక్ అందుకున్నాడు ఈ హీరో.


 ఆ ఒక్కటి అడక్కు అనే సినిమాలో నటించాడు అన్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఇటీవల విడుదలైంది. అయితే ఈ సినిమాతో అల్లరి నరేష్ మరోసారి ప్రేక్షకులను నవ్వించినప్పటికీ కమర్షియల్ గా మాత్రం వర్కౌట్ కాలేదు. కాగా ఇటీవల ఈ మూవీ అటు ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది అన్నది తెలుస్తోంది. అమెజాన్ ప్రైమ్ లో ఈనెల 31వ తేదీన ఆ ఒక్కటి అడక్కు సినిమా స్రీమింగ్ కానున్నట్లు సమాచారం. అయితే దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది. మళ్లీ అంకం దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అల్లరి నరేష్ సరసన ఫరియా అబ్దుల్లా హీరోయిన్గా నటించగా.. గోపి సుందర్ మ్యూజిక్ అందించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: