సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి టాలీవుడ్ సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు  సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా చైల్డ్ ఆర్టిస్ట్ గానే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మహేష్ బాబు తన నటనతో చిన్నప్పుడే కోట్లాదిమంది ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించుకున్నాడు. హీరోగా మారిన తర్వాత ఎంతోమంది ప్రేక్షకులకు ఫేవరెట్ అనిపించుకున్నాడు. ఇక ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉన్నాడు. గత కొంతకాలం నుంచి వరుస బ్లాక్ బస్టర్లు కొడుతూ ఇక ఇండస్ట్రీలో టాప్ హీరోగా కొనసాగుతున్నాడు.


 అయితే ప్రస్తుతం మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో నటించేందుకు రెడీ అవుతున్నాడు అన్న విషయం తెలిసిందే. ఇకపోతే మహేష్ బాబు లాగే ఇక ఆయన తనయుడు గౌతం కూడా ఇక తండ్రి సినిమాతోనే చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఇప్పటివరకు కేవలం ఒక్క సినిమాలో మాత్రమే నటించాడు గౌతం. ఇకపోతే ఇటీవల కొడుకు సాధించిన ఒక గొప్ప విషయాన్ని గుర్తు చేసుకుంటూ సూపర్ స్టార్ మహేష్ బాబు సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టగా.. ఇది కాస్త వైరల్ గా మారిపోయింది. మహేష్ బాబు కుమారుడు గౌతమ్ ఇటీవల గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్నాడు.


 ఈ క్రమంలోనే గ్రాడ్యుయేషన్ వేడుకల ఫోటోలని షేర్ చేస్తూ మహేష్ ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. తన హృదయం గర్వంతో ఉప్పొంగుతుంది అంటూ ఇంస్టాగ్రామ్ లో ఒక పోస్ట్ పెట్టాడు మహేష్ బాబు. నీ తర్వాత చాప్టర్ నువ్వే రాసుకోవాలి. నువ్వు మరింత వెలుగొందుతావని  భావిస్తున్నాను. నీ కలలను సహకారం చేసుకో తండ్రిగా నేను ఈరోజు గర్వపడుతున్నాను అంటూ తన కొడుకు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన విషయాన్ని ఉద్దేశించి మహేష్ బాబు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టగా ఇది కాస్త వైరల్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: