బాలీవుడ్‌లోకి అడుగు పెట్టిన  కథానాయికల జాబితాలో మరొకరు చేరారు. ఈమధ్యే వరుసగా దక్షిణాది భామలు హిందీ సినిమాల్లో అవకాశాలు అందుకుంటున్నారు. ఆ వరుసలలో చేరిన వల్లులు తమన్న భాటియకూర ఒకరు. తన వైట్ స్కిన్తో మిల్క్ బ్యూటీ అని పేరు తెచ్చుకున్న తమన్నా భాటియా బాలీవుడ్లో వరుస సిరీస్ తో ఒక ఊపు ఊపుతున్నారు.మిల్క్ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన అందం, అభినయంతో ఎంతో మందిని ఆకట్టుకుంది. అంతే కాకుండా తన డాన్స్‌కి సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అని చెప్పడంలో అతియోశక్తి లేదు.అయితే ఈ అమ్మడు సూపర్ హిట్ సిరీస్‌ లస్ట్ స్టోరీకి సీక్వెల్‌గా.. తెరకెక్కుతున్న 'లస్ట్ స్టోరీ 2' సిరీస్‌లో విజయ్‌ వర్మకు జోడీగా నటిస్తున్నది. తాజాగా ఈ సిరీస్‌ ప్రమోషన్లో భాగంగా ఓ ఇంటర్వులో ఈ బ్యూటీ హాట్ హాట్ కామెంట్స్‌ చేసింది. బోల్డ్ గా నటిస్తే తప్పేంటని.. లస్ట్ స్టోరీస్ సీజన్‌ 1 చూశాక తన అభిప్రాయమే మారిపోయిందని.. ఆడియన్స్ కూడా ఇలాంటివే చూస్తున్నారని ఈ భామ వెల్లడించింది. అలాగేే ఇలాంటి సిరీస్‌లు.. సీన్లు చూసేందుకు సిగ్గు పడే ధోరణి నుంచి కాలంతో పాటు అందరూ మారే స్టేజ్‌కి వచ్చారని తమన్నా చెప్పారు. తనను జనాలు ఎలా చూడాలనుకుంటున్నారో అలాగే తనను తాను ప్రజెంట్ చేసుకోవడం కూడా నటిగా నాకు అవసరమే అన్నారు. అంతేకాదు ఇప్పటి వరకు తాను బోల్డ్ అండ్ అడల్ట్ కంటెంట్ సీన్లకు ఓకే చెప్పలేదు కానీ ఇవి కూడా పార్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ అని రిమైనింగ్ సీన్స్‌ లాగే ఇవి కూడా సన్నివేశాలు మాత్రేమ అని లేట్‌ గా తెలుసుకున్నా అన్నారు. అండ్ దానికతోడు 'లస్ట్ స్టోరీస్‌ 2'లో బోల్డ్ సీన్స్‌లో యాక్ట్‌ చేసేటప్పుడు తనకు భయం, టెన్షన్ లేదు. ఎందుకంటే తన లవర్‌ విజయ్‌ వర్మ తనను ఎంతో జాగ్రత్తగా చూసుకున్నారని కాస్త సిగ్గుపడుతూ చెప్పారు తమన్నా  ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: