స్టార్ హీరో కమల్ హాసన్, రకుల్ ప్రీత్ సింగ్, సిద్ధార్థ్ కలిసి నటిస్తున్న మూవీ భారతీయుడు 2. శంకర్ డైరెక్షన్లో 1996లో వచ్చిన భారతీయుడు మూవీకి సీక్వెల్ గా ఇది రాబోతుంది. ఏక ఇందులో ప్రియా భవాని శంకర్, ఎస్ జె సూర్య కీలక పాత్రలో కనిపించాడు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ అన్నీ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పరిచాయి. ఇక ఈ క్రమంలో తాజాగా ఈ మూవీ నుంచి మేకర్స్ 28న సెకండ్ సాంగ్ ను విడుదల చేయనున్నట్లు అధికారిక ప్రకటన చేస్తూ ఓ పోస్టర్ను రిలీజ్ చేశారు.

అదేవిధంగా ఈ సినిమా ఆడియో లాంచ్ ను జూన్ 1న నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఇక ఈ విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా భారతీయుడు 2 జూలై 12న ప్రపంచవ్యాప్తంగా తమిళ్ మరియు హిందీ, తెలుగు, మలయాళం లో విడుదల కానున్నట్లు సమాచారం. ఇటీవల చిన్నా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సిద్ధార్థ్ ప్రేక్షకులను మెప్పించలేకపోయాడు. దీంతో తన అభిమానులు భారతీయుడు 2 అయినా హోప్స్ పెట్టుకున్నారు.

అదేవిధంగా పెళ్లి అనంతరం రకుల్ ప్రీత్ సింగ్ చేస్తున్న చిత్రం నే ఈ భారతీయుడు 2. పెళ్లి అనంతరం సినిమాలకి గ్యాప్ ఇచ్చి ఫ్యామిలీతో టైమ్స్ స్పెండ్ చేస్తున్నా ఈ బ్యూటీ భారతీయుడు 2 మూవీతో తన సెకండ్ ఇన్నింగ్స్ ను మొదలుపెట్టనుంది. ఈ సినిమా కనుక థియేటర్ల వద్ద సూపర్ రెస్పాన్స్ దక్కించుకుంటే ఇటు రకుల్ తో పాటు అటు సిద్ధార్థ్ కెరీర్ కూడా పూర్తిగా మారిపోతుందని చెప్పుకోవచ్చు.  ఇక కమల్ హాసన్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ సినిమాలో కదా ఎలా ఉన్నా తన నటనతో మైమరిపించే సత్తా కలిగిన వాడు. మరి ఈ మూవీతో ఎంతటి విజయాన్ని సాధించుకుంటాడో వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: