ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత తమకంటూ గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ హీరోయిన్స్ లో సిమ్రాన్ ఒకరు.ఒకప్పుడు తన నటన అందం అభినయంతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.  సిమ్రాన్ అనే ఈ పేరుకు పెద్ద పరిచయం అవసరం లేదు. తన అందం నటన అభినయంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న సీనియర్ హీరోయిన్స్ లో సిమ్రాన్ ఒకరు.టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలు అందరితో కలిసి పని చేసిన హీరోయిన్ ఎవరైనా ఉన్నారు అంటే సిమ్రాన్ ఒక్కరే అని చెప్పవచ్చు. తను నటించిన ప్రతి ఒక్క సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అని చెప్పుకోవచ్చు.సీనియర్ స్టార్ హీరోయిన్ సిమ్రాన్.. 1976లో ముంబైలో రిషిబాలా నావల్‌లో జన్మించిన ఆమె 1995లో హిందీ చిత్రంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన సిమ్రాన్..ఆ తర్వాత మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. 1996లో అబ్బాయిగారి పెళ్లి చిత్రం ద్వారా టాలీవుడ్‌లో అడుగుపెట్టింది. 1997లో విడుదలైన నేరుక్కు నెర్ సినిమా తమిళంలో ఫుల్ క్రేజ్ తీసుకువచ్చింది. ఒకప్పుడు స్టార్‌ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది. సౌత్‌లో చిరంజీవి,రజనీకాంత్‌,కమల్‌ హాసస్‌, బాలకృష్ణ,నాగార్జున, వెంకటేష్ వంటి స్టార్ హీరోల అందరి సరసన హీరోయిన్‌గా మెప్పించింది.సుమారుగా 15 ఏళ్ల క్రితమే తెలుగు సినిమాలకు గుడ్‌బై చెప్పిన సిమ్రాన్‌ పలు తమిళ సినిమాల్లో మాత్రం ఇప్పటికీ కనిపిస్తూనే ఉంది. అయితే, సుందరకాండ అనే తెలుగు సీరియల్‌లో 2009-2011 మధ్యకాలంలో ఆమె కనిపించింది. తాజాగా ఆమె మళ్లీ బుల్లితెరపై కనిపించేందుకు రెడీ అవుతున్నారట. ఏదైనా రియాల్టీ షోలో న్యాయనిర్ణేతగా సిమ్రాన్‌ రాబోతున్నారని కోలీవుడ్‌లో జోరుగా ప్రచారం జరుగుతుంది.మరికొందరైతే సిమ్రాన్‌ సీరియల్స్‌ రంగంలోకి అడుగుపెట్టబోతున్నారని, ఇప్పటికే ఆమెకు పలు అవకాశాలు వచ్చాయని తెలుపుతున్నారు. సినిమాల విషయానికి వస్తే ధ్రువ నక్షత్రం, అంధాగన్‌ రెండు చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అంధాగన్‌ హిందీలో టబు పోషించిన పాత్రను తెలుగులో తమన్నా, తమిళంలో సిమ్రన్‌, మలయాళంలో మమతామోహన్‌దాస్‌ పోషించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: