న్యాచురల్ బ్యూటీగా పేరు పొందిన సాయి పల్లవి ఇటీవల తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. నాగ చైతన్యతో లవ్ స్టోరి , రానాతో విరాట పర్వం సినిమాల తరువాత సాయి పల్లవి మళ్లీ తెలుగు సినిమాల్లో కనిపించింది లేదు.తెలుగు ఇండస్ట్రీలో సాయి పల్లవికి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది.మళయాళ సినిమా ప్రేమమ్ సినిమాతో హీరోయిన్‌గా పరిచియమైన సాయి పల్లవి , శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఫిదా సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టింది.చేసింది తక్కువ సినిమాలే అయిన సాయి పల్లవి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇక సాయి పల్లవి తన స్టెప్పులు అభిమానులతో ఈలలు వేయించిన ఘటనలు చాలానే ఉన్నాయి. తెలుగు, తమిళ, కేరళ భాషల్లో సినిమాలు చేస్తూ మోస్ట్ టాలెంటెడ్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. సాయి పల్లవి ఓ పట్టాన సినిమా ఓకే చేయదు. కథ నచ్చి అందులో తన పాత్రకు ప్రాధాన్యత ఉంటే తప్పిస్తే ఆ సినిమాకు సాయి పల్లవి గ్రీన్ సిగ్నల్ ఇవ్వదనే టాక్ ఇండస్ట్రీలో ఉంది.సాయి పల్లవి ప్రస్తుతం రామాయాణం సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తోంది ఈ భామ. రామాయాణం సినిమాలో రణ్‌బీర్ కపూర్ హీరోగా నటిస్తున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా సాయి పల్లవి చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. సాధారణంగా మహిళలకు పీరియడ్స్ అనేవి ఇబ్బంది పెడుతూనే ఉంటాయి. అయితే హీరోయిన్స్ ఈ పీరియడ్స్ సమస్యను షూటింగ్స్ సమయంలో ఎలా మేనేజ్ చేస్తారా అనే అనుమానం అందరిలోనూ నెలకొంది.తాజాగా దీనిపై సాయి పల్లవి క్లారిటీ ఇచ్చారు. సాయి పల్లవి మాట్లాడుతూ... పీరియడ్స్ టైం లో డాన్స్ చేయడం చాలా అసౌకర్యంగా ఉంటుంది. పలు చిత్రాల్లో పీరియడ్స్ సమయంలోనే నేను నృత్యాలు చేశాను. ప్రతికూల పరిస్థితులను పక్కన పెట్టి ముందుకు వెళ్లక తప్పదు. శ్యామ్ సింగరాయ్ మూవీలో శాస్త్రీయ నృత్యంతో కూడిన సాంగ్ కూడా నెలసరి సమయంలోనే చేశానని చెప్పుకొచ్చారు. విపరీతమైన కడుపు నొప్పితో ఉన్నప్పటికీ ఆ సాంగ్ పూర్తి చేశానని సాయి పల్లవి తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: