దర్శకుడు సుజిత్ ఇప్పటివరకు తీసిన సినిమాలు రెండు మాత్రమే. ప్రభాస్ తో తీసిన ‘సాహొ’ ఘోర పరాజయం చెందినా చిరంజీవి మొదట్లో తన ‘లూసీఫర్’ రీమేక్ విషయంలో దర్శకుడు సుజిత్ కు ఓటు వేశాడు. అయితే ఆతరువాత చిరంజీవికి నచ్చే విధంగా సుజిత్ ‘లూసీఫర్’ రీమేక్ లో మార్పులు చేయలేకపోవడంతో సుజిత్ స్థానంలో మోహన్ రాజా వచ్చి చేరిన విషయం తెలిసిందే.  ఇక పవన్ కళ్యాణ్ తో సినిమా తీసే విషయంలో పవన్ చెప్పిన విధంగా సుజిత్ తాను తీస్తున్న ‘ఓజీ’ ని పూర్తి చేస్తున్నాడు అంటు మరికొందరి అభిప్రాయం. అయితే మొదట్లో సుజిత్ పవన్ తో ఒక రీమేక్ మూవీని తీయాలని ప్రయత్నించాడు అని అంటారు. అయితే పవన్ సుజిత్ వైపు చూస్తూ ఒరిజనల్ కథలు లేవా అంటూ పవర్ స్టార్ ప్రశ్నించడంతో ఇప్పుడు ‘ఓజీ’ తెరపైకి వచ్చింది అని అంటారు.లేటెస్ట్ గా సుజిత్ కార్తికేయ నటించిన ‘భజే వాయు వేగం’ మూవీ ప్రమోషన్ ఫంక్షన్ లో మాట్లాడుతూ ‘ఓజీ’ సెప్టెంబర్ 27న విడుదల కావడం ఖాయం అంటూ సంకేతాలు ఇచ్చాడు. అంతేకాదు తాను ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల కోసం ఎదురు చూస్తున్నానని అంటూ పవన్ తిరిగి షూటింగ్ స్పాట్ లోకి ఎప్పుడు వస్తే అప్పుడు తాను షూటింగ్ ప్రారంభించడానికి రెడీగా ఉన్నాను అంటూ ఓపెన్ గా చెప్పడంతో ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత పవన్ షూటింగ్ స్పాట్ లోకి వెంటనే వస్తాడు అన్న నమ్మకం తనకు ఉంది అంటూ మరొక ట్విస్ట్ ఇచ్చాడు.ఈన్యూస్ పవన్ కళ్యాణ్ అభిమానులకు జోష్ ను కలిగించే వార్త అయినప్పటికీ ఎన్నికల ఫలితాలు వచ్చాక ఎన్ని రోజుల గ్యాప్ తో పవన్ తిరిగి ‘ఓజీ’ సెట్ లోకి అడుగుపెట్టినప్పుడు మాత్రమే ఈమూవీని సెప్టెంబర్ 27న విడుదల చేయడం జరుగుతుంది. ఇప్పటికే ఈమూవీ టైటిల్ తో పవన్ కళ్యాణ్ అభిమానులు కలలు కంటున్న సందర్భంలో సుజిత్ ఎంతకాలం పవన్ గురించి ఎదురు చూస్తూ ఉండగలరు అంటూ మరికొందరు ప్రశ్నిస్తున్నారు..  మరింత సమాచారం తెలుసుకోండి: