చలో అనే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన రష్మిక మందన.. తన నటనతో ఎంతలా ప్రేక్షకులను ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన అందం అభినయంతో తెలుగు పరీక్షకులందరికీ ఫేవరెట్ హీరోయిన్గా మారిపోయింది ఈ ముద్దుగుమ్మ. అంతేకాదు అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా ఎదిగింది. ఇక నేషనల్ క్రష్ అనే ఒక ప్రత్యేకమైన బిరుదును కూడా సొంతం చేసుకుంది అని చెప్పాలి.


 ఇక ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపును సంపాదించుకొని వరుసగా సినిమాలు చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. ఈ క్రమంలోనే ప్రస్తుతం ప్రతిష్టాత్మకంగా తెరకేక్కుతున్న పుష్ప 2 సినిమాలో నటిస్తోంది అన్న విషయం తెలిసిందే. ఈ సినిమాపై భారీ రేంజ్ లోనే అంచనాలు ఉన్నాయి. ఇక బాలీవుడ్ లో కూడా వరుసగా అవకాశాలు అందుకుంటూ అక్కడ బిజీ హీరోయిన్ గానే కొనసాగుతోంది.  తెలుగు తమిళ కన్నడ భాషలో అయితే వరుస అవకాశాలను అందుకుంటుంది అని చెప్పాలి.


 అయితే సాధారణంగా హీరోయిన్లు ఏదైనా సినిమా ఈవెంట్ కు వచ్చినప్పుడు ఎక్కువగా ఇంగ్లీష్ లోనే మాట్లాడటం చూస్తూ ఉంటాం. కానీ రష్మిక మంత్రం ఇలా సినిమా ఈవెంట్ లలో తెలుగులో మాట్లాడటానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అయితే ఇలా రష్మిక ఎందుకు తెలుగులో మాట్లాడుతుంది అన్న విషయాన్ని చెప్పుకొచ్చింది హీరోయిన్. చాలా మంది నేను వారి భాషలో మాట్లాడాలని కోరుకుంటారు. అందుకే నాకు భాష రాకపోయినా మాట్లాడేందుకు ప్రయత్నిస్తా. ఇంగ్లీష్ మాట్లాడి వారిని అగౌరపరచాలని అస్సలు అనుకోను చెప్పుకొచ్చింది. అయితే ఇటీవలే ఒక మూవీ ఈవెంట్లో రష్మిక తెలుగులో మాట్లాడగా అర్థం కాలేదు ఇంగ్లీష్ లో మాట్లాడమని ఒక అభిమాని సోషల్ మీడియాలో ట్యాగ్ చేయడంతో రష్మిక ఇలాంటి వ్యాఖ్యలు చేసింది. కాగా రష్మిక మందన హీరోయిన్గా నటించిన పుష్ప 2 సినిమా ఆగస్టు 15వ తేదీన విడుదల కాబోతుంది అన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: