తెలుగు సినీ పరిశ్రమలో సూపర్ క్రేజ్ కలిగిన నటులలో అల్లరి నరేష్ ఒకరు. ఈయన కెరియర్ ప్రారంభం నుండి చాలా సంవత్సరాల పాటు కేవలం కామెడీ ప్రాధాన్యత ఎక్కువ కలిగిన సినిమాలపైనే దృష్టి పెడుతూ వచ్చాడు. అలాగే జనాలను కూడా ఈయన నుండి కామెడీ సినిమాలను మాత్రమే ఎక్స్పెక్ట్ చేస్తూ వస్తారు. అలాంటి సమయం లోనే ఈయన గమ్యం అనే సినిమాలో గాలి శీను పాత్రలో నటించి తనలో కామెడీ నటుడు మాత్రమే కాదు ఒక అద్భుతమైన సీరియస్ పాత్ర చేసే నటుడు ఉన్నాడు అని నిరూపించుకున్నాడు. ఆ తర్వాత నుండి అడపా దడపా ఈయన సీరియస్ పాత్రలు చేస్తూ వస్తున్నాడు. 

ఇక సుడిగాడు మూవీ తర్వాత ఈయన నటించిన ఏ కామెడీ సినిమా కూడా పెద్దగా సక్సెస్ కాలేదు. అలాంటి సమయంలో నరేష్ "నాంది" అనే ఒక పవర్ఫుల్ సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ నరేష్ కు అద్భుతమైన విజయాన్ని అందించింది. ఇక ఆ తర్వాత ఈయన ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం , ఉగ్రం అనే రెండు పవర్ఫుల్ సినిమాలలో నటించాడు. ఇక కొన్ని రోజుల క్రితమే ఆ ఒకటి అడక్కు అనే కామెడీ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ పెద్ద విజయం అందుకోలేదు. ఇక ప్రస్తుతం నరేష్ "బచ్చల మ" అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ లో కూడా పవర్ఫుల్ రోల్ లో నరేష్ కనిపించబోతున్నాడు.

తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేయగా ఇందులో నరేష్ పవర్ఫుల్ లుక్ లో ఉన్నాడు. ఈ పోస్టర్ ప్రస్తుతం సూపర్ గా వైరల్ అవుతుంది. ఇకపోతే ఈ సినిమా కనుక నరేష్ కు బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందించినట్లు అయితే నరేష్ కామెడీ సినిమాల వైపు తిరిగి చూడడం కష్టమే అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు. మరి నరేష్ ఈ సినిమాతో ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో , తర్వాత కామెడీ సినిమాలపై ఆసక్తి చూపిస్తాడో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: