టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి జోష్ లో కెరీర్ ను ముందుకు కొనసాగిస్తున్న యువ హీరోలలో విశ్వక్ సేన్ ఒకరు. ఈయన ఇప్పటి వరకు తన కెరీర్ లో చాలా సినిమాలలో నటించాడు. అందులో భాగంగా ఈయన నటించిన చాలా శాతం సినిమాలు మంచి విజయాలను అందుకోవడంతో ప్రస్తుతం ఈ నటుడికి తెలుగు లో మంచి గుర్తింపు ఉంది. ఆఖరుగా ఈ నటుడు గామి అనే భావిద్యమైన సినిమాలో హీరో గా నటించాడు.

సినిమా భారీ అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర డీసెంట్ కలెక్షన్ లను వసూలు చేసి మంచి విజయాన్ని అందుకుంది. ఇకపోతే తాజాగా విశ్వక్ "గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి" అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ లో నేహా శెట్టి హీరోయిన్ గా నటించగా ... మోస్ట్ బ్యూటిఫుల్ నటీమణి అంజలి ఈ సినిమాలో ఓ కీలకమైన పాత్రలో కనిపించబోతుంది. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్య దేవర నాగ వంశీ నిర్మించిన ఈ మూవీ ని రేపు అనగా మే 31 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు.

ఇకపోతే ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 8 కోట్ల మేర ప్రీ  రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. అలాగే ప్రపంచ వ్యాప్తంగా మరో 2 కోట్ల మేర ప్రి రిలీజ్ బిజినెస్ జరిగినట్లు దానితో ఈ సినిమాకు మొత్తంగా వరల్డ్ వైడ్ గా 10 కోట్ల రిలీజ్ బిజినెస్ జరిగినట్లు ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 11 కోట్ల షేర్ కలెక్షన్ లను రాబట్టినట్లు అయితే బ్రేక్ ఈవెన్ ఫార్ములా ను కంప్లీట్ చేసుకుని క్లీన్ హిట్ గా నిలవబోతున్నట్లు తెలుస్తోంది. మరి 11 కోట్ల షేర్ కలెక్షన్ లను రాబట్టడం అంటే చిన్న విషయం ఏమీ కాదు. సినిమాకు కనుక మంచి టాక్ వస్తేనే అది సాధ్యం అవుతుంది. మరి విశ్వక్ ఈ సినిమాతో పెద్ద టార్గెట్ ను క్రాస్ చేయడంలో సక్సెస్ అవుతాడా లేదా తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

vs