మోస్ట్ బ్యూటిఫుల్ నటీమణి అయినటువంటి చాందిని చౌదరి కలర్ ఫోటో సినిమాతో మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఈ మూవీ అనంతరం ఈమెకు వరుసగా తెలుగు సినిమాలలో అవకాశాలు దక్కుతున్నాయి. అందులో భాగంగా ఈమె తాజాగా కూడా వరుస సినిమాలలో నటిస్తోంది. కొన్ని రోజుల క్రితమే గామి అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించి మంచి విజయాన్ని అందుకున్న ఈ నటి తాజాగా యేవమ్ , మ్యూజిక్ షాప్ మూర్తి అనే రెండు సినిమాలలో నటించింది.

ఈ రెండు మూవీ లు కూడా జూన్ 14 వ తేదీన విడుదల కానున్నాయి. దానితో ఈమె వరస ఇంటర్వ్యూ లలో పాల్గొంటుంది. ఇకపోతే ప్రస్తుతం ఈ బ్యూటీ నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న ఎన్ బి కే 109 అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న సినిమాలో ఓ కీలక పాత్రలో కనిపించబోతుంది. తాజాగా ఈ బ్యూటీ ఓ ఇంటర్వ్యూ లో భాగంగా ఎన్ బి కె 109 మూవీ గురించి. , బాలకృష్ణ వ్యక్తిత్వం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చింది.

చాందిని తాజాగా ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ ... ఎన్ బి కే 109 లో నాది అద్భుతమైన పాత్ర. ఆ సినిమాలో నాది చాలా స్ట్రాంగ్ ఉమెన్ క్యారెక్టర్. బాబి గారు నన్ను నమ్మి ఒక గొప్ప క్యారెక్టర్ ఇచ్చారు. ఆ సినిమా కోసం నేను ఎంతగానో కష్టపడుతున్నాను అని చెప్పింది. ఇక బాలయ్య గురించి మాట్లాడుతూ ... ఆయన చాలా సరదా మనిషి. చిన్న పెద్ద అని చూడకుండా అందరితో కలిసి పోతారు. ఆయన వ్యక్తిత్వం అద్భుతమైనది. బాలకృష్ణ గారు సెట్ లో ఉంటే చాలా సరదాగా ఉంటుంది. ఆయన సన్నివేశాల చిత్రీకరణ అయిన కూడా ఆయన సెట్ లోనే ఉంటూ అందరిలోనూ జోష్ నింపుతూ ఉంటారు అని చాందిని చౌదరి బాలకృష్ణ గురించి చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

cc