నాగచైతన్యతో విడిపోయిన తరువాత సమంత కెరియర్ ఏమాత్రం ఆశాజనకంగా లేదు. దేనికితోడు ఆమెకు మయోసైటీస్ వ్యాధి రావడంతో ఆవ్యాధి నుండి బయటపడటానికి ఆమె ఎంతో శ్రమ పడవలసి వచ్చింది. ఇప్పటికీ ఆమెను అనారోగ్య సమశ్యలు వెంటాడుతూనే ఉన్నాయి అంటూ కోలీవుడ్ మీడియా గాసిప్పులు వ్రాస్తూనే ఉంది ఈ వార్తల పై ఎటువంటి క్లారిటీ లేదు.


ఇలాంటి గాసిప్పులు వచ్చినప్పుడల్లా ఆమె తన జిమ్ లో చేస్తున్న రకరకాల ఎక్ససైజ్ వీడియోలను షేర్ చేస్తూ తన ఫిట్నెస్ గురించి వస్తున్న రూమర్లను పరోక్షంగా ఖండిస్తోంది. ఆమధ్య సమంత తన సొంత నిర్మాణ సంస్థను ప్రకటించి ఒక హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ చేయబోతున్నట్లు ప్రకటన ఇచ్చినప్పటికీ ఆసినిమా పరిస్థితి పై ఎవరికీ ఎటువంటి క్లారిటీ లేదు. ప్రస్తుతం ఆమె నటిస్తున్న సినిమాలు ఒక్కటి కూడ లేవు.


టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన ఆమెతో సినిమాలు చేయడానికి ప్రస్తుతం ఇండస్ట్రీలోని టాప్ హీరోల నుండి మీడియం రేంజ్ హీరోల వరకు ఎవరు పెద్దగా ఆశక్తి కనపరచడం లేదు అన్న రూమర్స్ వస్తున్నాయి. దీనితో ఆమె కెరియర్ ముగింపుకు వచ్చిందా అంటూ కొందరు సందేహాలు వ్యక్త పరుస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల మధ్య ఒక ఊహించని అదృష్టం ఆమె తలుపు తట్టినట్లుగా వార్తలు వస్తున్నాయి.


మళయాళ టాప్ హీరో మమ్ముట్టీ గౌతమ్ మీనన్ ల కాంబినేషన్ లో త్వరలో ప్రారంభం కాబోతున్న మూవీలో సమంత హీరోయిన్ గా ఎంపిక అయింది అంటున్నారు. వాస్తవానికి ఈ మూవీలో హీరోయిన్ గా నయనతార ఎంపిక అయింది. అయితే పారితోషిక విషయంలో నయనతార కు నిర్మాతలకు ఏర్పడ్డ భేధాభిప్రాయాలు వల్ల ఆమెను తప్పించి ఆమె స్థానంలో సమంతను ఎంపిక చేశారు అని అంటున్నారు. ప్రస్తుతం మమ్ముట్టి వరస హిట్లతో దూసుకుపోతున్నాడు. అలాంటి టాప్ హీరో సినిమాలో సమంతకు అవకాశం రావడంతో ఆమె కెరియర్ కు మళ్ళీ ఊహించని బ్రేక్ వస్తుందని అంచనాలు వస్తున్నాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి: