తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న దర్శకులలో ఒకరు అయినటువంటి వైవిఎస్ చౌదరి ఆఖరుగా సాయి ధరమ్ తేజ్ హీరోగా రూపొందిన రేయ్ అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమా పర్వాలేదు అనే రేంజ్ అంచనాల నడుమ థియేటర్లలో విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. ఈ మూవీ విడుదల అయ్యి ఇప్పటికే చాలా సంవత్సరాలు అవుతోంది. ఇప్పటివరకు ఈ దర్శకుడు ఏ మూవీ కూడా చేయలేదు. ఇకపోతే కొన్ని రోజుల క్రితమే ఆయన తన తదుపరి మూవీ కి సంబంధించిన వివరాలను వెల్లడించాడు.

ఆ కార్యక్రమంలో భాగంగా ఈయన వైవిఎస్ చౌదరి దర్శకత్వం వహించిన దేవదాసు సినిమా సమయంలో జరిగిన కొన్ని సంఘటనల గురించి వివరించారు. తాజాగా ఈయన మాట్లాడుతూ ... నేను రామ్ హీరోగా ఇలియానా హీరోయిన్గా దేవదాసు సినిమాను చేశాను. ఆ సినిమా సమయంలో రామ్ కి ఎలాంటి క్రేజ్ లేదు. నేను ఆ సినిమాని సంక్రాంతి కానుకగా జనవరి 11 వ తేదీన విడుదల చేశాను. సంక్రాంతి సీజన్ లో పెద్దగా లవ్ స్టోరీ సినిమాలను విడుదల చేయరు.

సంక్రాంతి సీజన్ అంతా ఫ్యామిలీ సినిమాలని జనాలు ఎక్కువ చూస్తుంటారు. అయినా నేను రిస్కు చేసి ఆ మూవీ ని విడుదల చేశాను. ఇక నా మూవీ జనవరి 11.వ తేదీన విడుదల అయితే ఆ తర్వాత రోజు అనగా జనవరి 12 వ తేదీనే లారెన్స్ హీరోగా రూపొందిన స్టైల్ సినిమా విడుదల అయింది. ఆ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి , టాలీవుడ్ కింగ్ నాగార్జున గెస్ట్ పాత్రలలో నటించారు. దానితో జనాలు అంత ఆ సినిమా వైపే వెళ్ళిపోయారు. నా సినిమా వైపు జనాలు రాలేదు. ఇక ఆ తర్వాత నాలుగు వారాలు పూర్తయ్యాక నా సినిమా మెల్లమెల్లగా పుంజుకొని మంచి విజయం అందుకుంది అని వైవిఎస్ చౌదరి తాజాగా చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: