ఇక ఈ సిరీస్ కథ విషయానికి వస్తే, కింగ్ విసెరీస్ టార్గారియన్ తన పరిపాలనలో తన కూతురు రెనెరియా టార్గారియన్ను రాణిగా ప్రకటిస్తాడు. అతని మరణం తరువాత, విసెరీస్ రెండో భార్య అలిసెంట్ తన కుమారుడు ఏగాన్ టార్గారియన్ను (Aegon Targaryen) రాజుగా ప్రకటిస్తుంది. విసెరీస్ కుమార్తె రెనెరియా టార్గారియన్ నిజం తెలుసుకుని, తనను తాను రాణిగా ప్రకటించుకుంటుంది. దీనితో ఈ రెండు గ్రూపుల మధ్య యుద్ధం జరగనుంది. ఈ సీజన్లో ఐరన్ థ్రోన్ను ఎవరు దక్కించుకుంటారో చూడాలి.
ఈ సిరీస్కు అలాన్ టేలర్ (Alan Taylor) దర్శకత్వం వహిస్తుండగా, మాట్ స్మిత్, ఒలివియా కుక్, ఎమ్మా డి’ఆర్సీ, ఈవ్ బెస్ట్, స్టీవ్ టౌసైంట్, ఫాబియన్ ఫ్రాంకెల్, ఇవాన్ మిచెల్, టామ్ గ్లిన్-కార్నీ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. జూన్ 16 నుంచి ప్రపంచవ్యాప్తంగా మ్యాక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుండగా, భారతదేశంలో జియో సినిమా (Jio Cinema) వేదికగా జూన్ 17 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి