కోలీవుడ్ స్టార్ నటలలో విజయ్ సేతుపతి ఒకరు. ఈయన ఇప్పటివరకు తన కెరీర్ లో ఎన్నో సినిమాలలో హీరోగా నటించడం మాత్రమే కాకుండా చాలా సినిమాలలో ముఖ్య పాత్రలలో, కీలక పాత్రలలో, విలన్ పాత్రలలో కూడా నటించి ఇండియావ్యాప్తంగా గొప్ప గుర్తింపును సంపాదించుకున్నాడు. తాజాగా విజయ్ సేతుపతి "మహారాజా" అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ జూన్ 14 వ తేదీన తమిళ్ , తెలుగు భాషల్లో విడుదల అయింది. ఈ సినిమాకు విడుదల అయిన మొదటి రోజే అద్భుతమైన బ్లాక్ బాస్టర్ టాక్ లభించింది.

దానితో ఈ సినిమా ఇప్పటికే 50 కోట్లకు పైగా కలెక్షన్లను కొల్లగొట్టి బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పటికీ కూడా కలెక్షన్ల వర్షాన్ని కురిపిస్తుంది. ఈ సినిమా ఇదే స్పీడ్ లో కలెక్షన్లను వసూలు చేస్తే మరో కొన్ని రోజుల్లోనే 100 కోట్ల కలెక్షన్ క్లబ్ లోకి కూడా జాయిన్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక ఈ సినిమా అద్భుతమైన విజయం సాధించి భారీ కలెక్షన్లను వసూలు చేస్తున్న నేపథ్యంలో తాజాగా విజయ్ సేతుపతి పాత్రికేయులతో ముచ్చటించారు. అందులో భాగంగా ఈయన అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన హీరోయిన్గా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన పుష్ప మూవీ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చాడు.

విజయ్ సేతుపతి తాజాగా పాత్రికేయులతో ముచ్చటిస్తూ పుష్ప మూవీ ని ఇప్పటి వరకు రెండు సార్లు చూశాను అని చెప్పారు. ఇక ఇప్పటికే విజయ్ తెలుగులో చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన సైరా నరసింహారెడ్డి సినిమాలో ఓ ముఖ్యమైన పాత్రలో నటించగా , పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా కృతి శెట్టి హీరోయిన్గా బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రూపొందిన ఉప్పెన మూవీ లో ప్రతి నాయకుడి పాత్రలో నటించాడు. ఈ రెండు మూవీల ద్వారా ఈయనకు తెలుగులో మంచి గుర్తింపు లభించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

vs