ఇండియన్ స్క్రీన్ పై సందడి చేసేందుకు రెడీ అయిన మూవీ కల్కి. ప్రభాస్, దీపికా పదుకొనే, అమితాబచ్చన్, కమల్ హాసన్ వంటి అగ్ర నటీనటులు ఈ చిత్రంలో నటించారు. దీంతో ఈ మూవీపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. భారీ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ సినిమాకు అశ్వినీ దత్ నిర్మాతగా వ్యవహరించారు. ఇక కల్కి ట్రైలర్ ఇప్పటికే అలరించగా.. నేడు అనగా జూన్ 21 సాయంత్రం 6 గంటలకు సెకండ్ ట్రైలర్ను రిలీజ్ చేస్తున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

ఆన్లైన్లో కల్తీ సెకండ్ ట్రైలర్ లీక్ కావడంతో మూవీ టీం ఫైనల్ వార్ పేరుతో కలిసి థియేట్రికల్ ట్రైలర్ను రిలీజ్ చేయనుంది. ఇక ఇదిలా ఉంటే ముంబైలో కల్కి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎంతో గ్రాండ్గా జరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నలుగురు స్టార్స్ అదిరిపోయే అవుట్ ఫిట్స్ తో దర్శనమిచ్చారు. ఈ క్రమంలో సరదా సన్నివేశాలు జరగడంతో పాటు ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు. ఈ సందర్భంగా నాగశ్విన్ పై అమితాబచ్చన్ కామెంట్ చేశారు.

సుమారు గంట పాటు జరిగిన కల్కి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దాదాపుగా 12 నిమిషాల పాటు నలుగురు అగ్ర తారలతో క్యు అండ్ ఏ సెషన్ నిర్మించాడు హోస్ట్ రానా. ఈ సందర్భంగా కల్కి మూవీ గురించి ఆ కథ విన్నప్పుడు వచ్చినా అనుభూతి గురించి అమితాబచ్చన్ ను రానా ప్రశ్నించాడు. " కల్కి స్టార్ట్ అవ్వడం గ్రేట్ హానర్. ట్రూలి వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఇది ఒక కొత్త ప్రపంచం. ఇటువంటి సినిమా గతంలో ఎప్పుడూ రాలేదు. ఇలాంటి సినిమాని ఆలోచించిన నాగ్ అశ్విన్కి అండ్ టీం అందరికీ అభినందనలు. నాగి ఈ కథ చెప్పినప్పుడు చాలా ఆశ్చర్యపోయాను. అసలు ఏం డ్రింక్ చేస్తే ఇటువంటి కథని ఆలోచించగలిగాడని అనిపించింది " అంటూ సమాధానమిచ్చాడు అమితాబచ్చన్. ప్రజెంట్ అమితాబచ్చన్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: