పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటించిన తాజా చిత్రం కల్కి.. ఈ సినిమా కోసం అభిమానులు చాలా ఎక్సైటింగ్ గా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికీ అన్ని హంగులు పూర్తిచేసుకుని జూన్ 27వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కు సిద్ధమయ్యింది. ప్రమోషన్స్ నీ కూడా చిత్ర బృందం చాలా వేగవంతంగానే చేస్తున్నారు. నిన్నటి రోజున సాయంత్రం ట్రైలర్ ని కూడా విడుదల చేయగా ట్రైలర్ ప్రేక్షకులను అభిమానులను బాగా ఆకట్టుకుంది. మొదటి ట్రైలర్ తో కాస్త నిరాశపరిచిన రెండవ ట్రైలర్ తో మంచి ఊపు తీసుకు వచ్చినట్టుగా కనిపిస్తోంది.


ముఖ్యంగా కల్కి సినిమాలోని యాక్షన్ సన్నివేశాలు హాలీవుడ్ సినిమా ని తలపించేలా ఉన్నాయి.. ప్రభాస్ అమితాబ్ ల మధ్య యాక్షన్స్ సన్నివేశాలు కూడా బాగానే ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా కల్కి ట్రైలర్ సినిమాను చూసి డైరెక్టర్ రాంగోపాల్ వర్మ కూడా ఫిదా అయి తన ట్విట్టర్ నుంచి ఒక పోస్టుని షేర్ చేశారు. అలాగే ప్రభాస్ సినిమా పైన ప్రశంసలు కూడా కురిపించారు. ఈ సమయంలోనే కల్కి ట్రైలర్ ను షేర్ చేసి ఏదో ఒక పజిల్ ని ఇచ్చాడు.


ఇందులో కొన్ని పదాలు ఇచ్చి మధ్యలో లెటర్ ను మిస్ చేయడం జరిగింది. దీనిని ముందుగా ఎవరైతే ఫీల్ చేస్తారో వారికి లక్ష రూపాయలు ఇస్తానంటూ ఒక బంపర్ ఆఫర్ ని కూడా ప్రకటించారు.. ప్రస్తుతం రాంగోపాల్ వర్మ చేసిన ట్వీట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నది. ఈ విషయం పైన అటు అభిమానులు, నేటిజన్స్ విభిన్నమైన కామెంట్స్ తో మోత మోగిస్తున్నారు. మరి కొంతమంది ప్రభాస్ కల్కి సినిమా ప్రమోట్ చేసే బాధ్యత తీసుకున్నారేమో అంటూ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనే దిశాపటాని వంటి వారు నటిస్తూ ఉన్నారు. అలాగే బ్రహ్మానందం, రాజేంద్రప్రసాద్ వంటి నటీనటులు కూడా నటిస్తూ ఉన్నారు. వైజయంతి మూవీస్ బ్యానర్ పైన భారీ బడ్జెట్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: