తమిళ సినిమా ఇండస్ట్రీలో వరుస సినిమాలు చేస్తు తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు అట్లీ కుమార్ ప్రస్తుతం పెద్ద పాన్ ఇండియా డైరెక్టర్ గా సూపర్ ఫాంలో ఉన్నాడు. కోలీవుడ్ కి ఎస్ ఎస్ రాజమౌళిలా తయరాయ్యాడు. ఎందుకంటే ఈయన చేసిన ప్రతి సినిమా కూడా మంచి విజయాన్ని సాధిస్తూ మంచి వసూళ్ళని రాబడుతుంది. అట్లీ కూడా వైవిధ్యమైన కథలతో కమర్షియల్ సినిమాలు తీస్తూ ముందుకు వెళుతూ ఉంటాడు.ఈయన చేసిన రాజా రాణి,తేరి, బిగిల్,జవాన్ లాంటి సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టి భారీ వసూళ్లు రాబట్టి బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ సక్సెస్ లను సాధించాయి. ఇలా ఉంటే  చేసిన ప్రతి సినిమా కూడా ఇండస్ట్రీలో మంచి విజయాన్ని సాధిస్తూ వస్తున్నాయి.ఇక ఈ క్రమంలోనే ఆయన అల్లు అర్జున్ తో కూడా ఒక సినిమా చేయబోతున్నారనే వార్తలు వచ్చాయి. అందుకు తగ్గట్టుగానే ఈ సినిమాకు సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా తెలియజేశారు. 


సినిమా ఉంటుందని బన్నీ ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు. కానీ ఈ సినిమా క్యాన్సిల్ అయ్యింది.అట్లీ నే కావాలని క్యాన్సిల్ చేసుకున్నాడు అంటూ ఆయన మీద సోషల్ మీడియాలో విపరీతమైన చర్చలైతే జరుగుతున్నాయి.అయితే అట్లీ ఒక ప్లాన్ ప్రకారమే సల్మాన్ ఖాన్ తో సినిమా చేయాలనే ఉద్దేశ్యం తో అల్లు అర్జున్ తో సినిమా ని క్యాన్సల్ చేసుకున్నాడు అంటూ సమాచారం. ఈ విషయంపై అల్లు అర్జున్ ఫ్యాన్స్ నుంచి అట్లీ పై విపరీతంగా ట్రోలింగ్స్  నడుస్తున్నాయి. ప్రస్తుతం ఈ వార్త తెగ వైరల్ అవుతుంది. ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ సినిమా రిలీజ్ డేట్ ఆగష్టు 15 వ తేదీ నుంచి డీసెంబర్ నెలకి వాయిదా పడింది. ఇక అట్లీ కూడా ఫుల్ బిజీగా ఉన్నాడు. షారుఖ్ ఖాన్ తో జవాన్ లాంటి 1100 కోట్ల భారీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన అట్లీ.. ప్రస్తుతం వరుణ్ దావన్ తో బేబీ జాన్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తెరీ సినిమాకి రీమేక్ గా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: