కంగనా రనౌట్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌట్ ఎన్నో సినిమాల్లో నటించి తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకుంది. చంద్రముఖి 2 సినిమాలో హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టు కూడా అయిన సంగతి కూడా తెలిసిందే. వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌట్ ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. హిమాచల్ ప్రదేశ్ లోని మండి నియోజకవర్గం నుంచి బిజెపి తరఫున పోటీ చేసిన ఈ భామ తన ప్రత్యర్థ విక్రమాదిత్యపై గెలుపొందింది.   


ఆయన పై 74755 ఓట్ల తేడాతో ఘన విజయం సాధించింది. హిమాచల్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వీరభద్రగింగ్ కుమారుడైన విక్రమాదిత్య సింగ్ ను చిత్తు చేసింది బాలీవుడ్ ఫైర్ బ్రాండ్. ఇకపోతే సునంద రాయ్ అనే వ్యక్తి "ఇదేం సెలబ్రేషన్స్? లిబరల్స్ అండ్ ఇస్లామిస్ట్స్..ప్రపంచంలో అత్యంత శాంతియుత సెలబ్రేషన్ కదా" అని రాసుకొచ్చి ఓ వీడియో షేర్ చేశాడు. దీనికి నేడు జూలై 29 న కంగనా ఆ ట్విట్ కు రీట్విట్ చేస్తూ.."ఈ ఆచారం చాలా డిఫరెంట్ ఉంది. చుడానికి ఎంతో భయంకరంగా ఉంది.


ఇలాంటి ప్రపంచంలో మనుగడ సాగించాలంటే హిందూ మగాళ్లు కూడా ఎన్నో ఒక రకమైన యుద్ధ విద్యలో శిక్షణ పొందాల్సిన అవసరం ఉంది? ఇలాంటి పరిస్థితులు చూస్తుంటే మీ రక్తాన్ని కూడా కాస్త మరిగించుకోవడంలో తప్పేం లేదు. నేను చెప్పింది కాదంటారా? అంటు ఫైర్ బ్రాండ్ కంగనా క్యాప్షన్ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ నటి ట్వీట్ సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది. కంగనా ట్వీట్ పై పలువురు పలు రకాలుగా స్పందిస్తున్నారు. ప్రస్తుతం ఈ ట్రీట్ నెట్టింట వైరల్ గా మారింది. ఈ ట్వీట్ చూసిన వారంతా కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: