టాలీవుడ్ ఇండస్ట్రీ లో అదిరిపోయే రేంజ్ క్రేజ్ ఉన్న స్టార్ హీరోలలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకరు. పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఎన్నో విజయవంతమైన సినిమాలలో హీరో గా నటించి టాలీవుడ్ ఇండస్ట్రీ లో తనకంటూ ఒక అద్భుతమైన గుర్తింపును ఏర్పరచుకున్నాడు. ఇకపోతే ఈయనతో సినిమా చేయాలి అని కొంత మంది దర్శకులు ఎదురు చూస్తున్న సందర్భాలు కూడా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ హీరోగా ఎస్ జె సూర్య చాలా సంవత్సరాల క్రితం ఖుషి అనే మూవీ ని రూపొందించాడు. ఈ మూవీ అద్భుతమైన విజయం అందుకుంది.

సూర్య కు కూడా ఈ సినిమా ద్వారా తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు లభించింది. పవన్ కళ్యాణ్ హీరో గా ఎస్ జె సూర్య తెరకెక్కించిన ఖుషి మూవీ అద్భుతమైన విజయం సాధించడంతో ఎస్ జె సూర్య కు పవన్ రెండవ అవకాశం ఇచ్చాడు. దానితో ఆయన కొమరం పులి అనే సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమా మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఈ సినిమా తర్వాత నుండి పవన్ హీరోగా మరో మూవీ చేయాలి అని ఈ దర్శకుడు ఎదురు చూస్తున్నాడు. కాకపోతే ఆయనకు అవకాశం దొరకడం లేదు.

ఇకపోతే టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి సురేందర్ రెడ్డి కూడా చాలా సంవత్సరాలుగా పవన్ కళ్యాణ్ తో ఓ మూవీ చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు. కొంత కాలం క్రితం పవన్ కళ్యాణ్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ మూవీ స్టార్ట్ కాబోతున్నట్లు అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. కానీ ఆ తర్వాత పవన్ పొలిటికల్ పనులతో బిజీ కావడం వల్ల మళ్ళీ ఈ న్యూస్ సైలెంట్ అయిపోయింది. సురేందర్ రెడ్డి మాత్రం పవన్ తో ఒక సినిమా చేయడానికి గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా ఈ ఇద్దరు దర్శకులు పవన్ తో సినిమాలు చేయడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: