తెలుగు సినీ పరిశ్రమలో సూపర్ సాలిడ్ క్రేజ్ కలిగిన సీనియర్ స్టార్ హీరోలలో నందమూరి నట సింహం బాలకృష్ణ ఒకరు బాలకృష్ణ ఇప్పటి వరకు ఎన్నో రకాలైన సినిమాలలో నటించి అందులో చాలా మూవీలతో అద్భుతమైన విజయాలను అందుకొని ఇప్పటికి కూడా ఫుల్ జోష్ లో కెరీర్ ను ముందుకు సాగిస్తున్నాడు. బాలకృష్ణ కొన్ని సంవత్సరాల క్రితం నటించిన సినిమాలలో ముగ్గురు హీరోయిన్లతో ఆడి పాడిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఆయన నటించిన కొన్ని సినిమాలలో ముగ్గురు హీరోయిన్లు ఉండడం , అలా ముగ్గురు హీరోయిన్ల సరసన ఆడి పాడిన సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయాలను అందుకున్న సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి.

ఉదాహరణకు బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన సింహా సినిమాలో బాలయ్య సరసన ముగ్గురు హీరోయిన్లు నటించారు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం బాలయ్య  ,  బాబి దర్శకత్వంలో NBK 109 అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ కోసం బాబి , బాలయ్య ఓల్డ్ సినిమాల ఫార్ములాను ఫాలో కాబోతున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమాలో ఏకంగా బాలయ్య సరసన ముగ్గురు హీరోయిన్లు కనిపించబోతున్నట్లు , వారితో బాలయ్య ఆడిపాడబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో ఊర్వశి రౌటేలా , ప్రగ్యా జైస్వాల్ , శ్రద్ధ శ్రీనాథ్ ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ముగ్గురితో బాలయ్య కు మంచి సన్నివేశాలు కూడా ఉండబోతున్నట్లు సమాచారం. ఇకపోతే బాలయ్య వరస సినిమాలతో ఫుల్ జోష్ లో ఉండడంతో ప్రస్తుతం NBK 109 వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న సినిమాపై బాలయ్య అభిమానులతో పాటు తెలుగు సినీ ప్రేమికులు కూడా మంచి అంచనాలు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: