ఇటీవల కాలంలో చాలామంది సినీ సెలబ్రిటీలు పెళ్లికాకముందే ప్రెగ్నెన్సీని అనౌన్స్ చేస్తూ తమ ఫ్యాన్స్ కి షాక్ ఇస్తున్నారు . ఇద్దరమ్మాయిలు మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ అమలాపాల్ కూడా ఇదే బాటలో నడిచింది . ఈ మూవీ తో అల్లు అర్జున్ అండ్ అమలాపాల్ మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా ఆకట్టుకోవడంతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకుంది . దీంతో ఆమెకు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి . వరస సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది . కానీ ఈ మధ్యకాలంలో ఈ అమ్మడు తెలుగులో అవకాశాలు రావడం తగ్గడంతో తమిళ్ ఇండస్ట్రీకే పరిమితం అయిపోయింది . ఇప్పటికే లేడీ ఓరియంటెడ్ చిత్రాలు యాక్షన్ త్రిల్లర్ చిత్రాలు చేస్తూ అదరగొడుతుంది ఈ భామ .


ఇక ఇదిలా ఉంటే ఈ బ్యూటీ కెరీర్ తొలినాలలో ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ ఏ ఎల్ విజయ్ ను ప్రేమించి 2014లో పెళ్లి కూడా చేసుకుంది . అలా మూడేళ్లు పాటు హ్యాపీ గా ఉన్న వీరు 2019లో మనస్పార్ధాలు రావడంతో విడాకులు తీసుకుని విడిపోయారు . అయితే విడాకులు తీసుకున్న వెంటనే ఆ ఏడాది దర్శకుడు ఇంకో వివాహం చేసుకున్నాడు . అయితే అమలాపాల్ మాత్రం ఆ బాధ నుంచి బయటపడడానికి సినిమాల్లో నటించడం ప్రారంభించింది . తరువాత వెబ్సైట్లో ఉన్నా జగత్ దేశాయ్ తో ప్రేమలో పడి గత ఏడాది మ్యారేజ్ చేసుకుంది .


అలా పెళ్లి చేసుకున్నా వీరికి ఇటీవల ఇలా అనే కుమారుడు కూడా జన్మించాడు . అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ బ్యూటీ తన సెకండ్ మ్యారేజ్ గురించి కీలక విషయాలను ప్రకటించింది . అమలాపాల్ మాట్లాడుతూ .. " నేను నా జీవితంలో మొదటి దశలో ఎంతో నష్టపోయాను . అందుకే రెండవ దశను ప్రారంభించడానికి కాస్త వెనుకడుగు వేశాను . కానీ నా భర్త నా ఆలోచనలు అన్నిటినీ మార్చేశాడు. మేము పెళ్లికి ముందు డేటింగ్ చేసాము. నా బాయ్ ఫ్రెండ్ నిర్ణయాలను కాదనలేక పోయాను. అందుకే డేటింగ్ చేసిన నెల రోజులకే నేను గర్భం దాల్చాను. అందుకే వెంటనే పెళ్లి చేసుకున్నాము " అంటూ వెల్లడించింది .

మరింత సమాచారం తెలుసుకోండి: