అయితే తాజాగా ఈ కేసు పైన ప్రముఖ యాంకర్ అనసూయ స్పందిస్తూ బాధితురాలికి జరిగిన ఈ అన్యాయం పట్ల తాను ఆవేదన చెందుతున్నానంటూ తెలియజేసింది. ఆ లేడీ కొరియోగ్రాఫర్ కి కచ్చితంగా న్యాయం జరగాలంటూ కోరుకున్నది అనసూయ.. అమ్మాయిలు మహిళలు తమకు ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితులను ఎవరైనా ఎదురయ్యేలా చేస్తే కచ్చితంగా వాటి గురించి చెప్పాలి.. మహిళలకు ఈ విషయాలలో ఎలాంటి సానుభూతి అవసరం లేదంటూ తెలిపింది.. ప్రతి మహిళా కూడా మహిళలకు అండగా నిలవడం మర్చిపోకూడదు.. ఆ కొరియోగ్రాఫర్ బాధిత యువతితో తాను కొద్దిరోజులుగా వర్క్ చేశానంటూ తెలిపింది అనసూయ.
పుష్ప సినిమా షూటింగ్ సెట్ లో రెండు మూడు సార్లు ఆ అమ్మాయి అయితే చూశానని.. కాని తాను ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఎక్కడా కూడా బయటికి తెలియవునేకుండా ఆ అమ్మాయి దాచిపెట్టుకుంది ఎంతో బాధను కూడా అనుభవించినట్టు కనిపించింది.. ఆ అమ్మాయికి మంచి టాలెంట్ ఉంది. ఇలాంటి ఇబ్బందులు తనలాంటి టాలెంట్ కలిగిన యువతిని ఏమాత్రం తగ్గించలేమంటూ తెలిపింది. తనతో వర్క్ చేసే మహిళలకు.. తోటి మహిళలకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా కూడా తాను వెంటనే స్పందిస్తానని అలాంటి వారికి మద్దతుగా నిలుస్తానంటూ తెలిపింది అనసూయ. ఆ కొరియోగ్రాఫర్ కోసం సపోర్టుగా ఉన్న ఫిలిం ఛాంబర్ అందరికీ కూడా కృతజ్ఞతలు అంటూ తెలిపింది అనసూయ.