మంచి ఫ్యామిలీలో హైడ్రామా కొనసాగుతోంది. నగర శివారు జల్‌పల్లి లోని మోహన్ బాబు ఇంటి వద్ద మంచు విష్ణు తరఫున 40 మంది బౌన్సర్లను మోహరించినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే మంచు విష్ణుకు పోటీగా మంచు మనోజ్ కూడా 30 మంది బౌన్సర్లను అక్కడ దింపారని.. అయితే మనోజ్ తరఫు బౌన్సర్లను లోపలికి సెక్యూరిటీ అనుమతించలేదని ప్రచారం జరుగుతోంది. కాసేపట్లో దుబాయ్ నుంచి మంచు విష్ణు రానున్నారని.. విష్ణు వచ్చిన తర్వాత గొడవ జరిగే అవకాశం ఉందంటూ వార్తా కథనాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
దీంతో.. మంచు ఫ్యామిలీలో.. గొడవ సినీ ఇండస్ట్రిలో సంచలనం రేగుతుంది. ఈ క్రమంలో మంచి విష్ణు టీం స్పందించింది. విష్ణు ప్రస్తుతం అమెరికాలో ఉన్నారని.. ఆయన సోమవారం హైదరాబాద్ వస్తున్నారని వార్తలో నిజం లేదని స్పష్టం చేసింది. మంచు విష్ణు.. స్వయానా వివరాలను అధికారికంగా ప్రకటించే వరకు ఎలాంటి వార్తలు నమ్మవద్దని కోరింది. కాగా నిన్న మనోజ్, మోహన్ బాబు మధ్య గొడవ జరిగిందన్న ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ వార్తలను మంచు ఫ్యామిలీ ఖండిస్తూ.. ప్రకటన విడుదల చేసింది.
ఆ తర్వాత కాసేపటికి మనోజ్ స్వల్ప గాయాలతో ఆసుపత్రికి వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకోవడంతో వీరి మధ్య నిజంగానే గొడవ జరిగినట్టు తెలుస్తోంది. అంతకుముందు తనపై దాడి జరిగినట్టు మనోజ్ 100 డయల్ యువర్ నెంబర్ కు ఫోన్ చేసి ఫిర్యాదు చేసినట్టు పోలీసులు చెప్పారు. మంచు మోహన్ బాబుకు చెందిన.. తిరుపతి సమీపంలో ఉన్న విద్యాసంస్థల విషయంలో అన్నదమ్ముల మధ్య గొడవలు జరుగుతున్నట్టు కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతుంది. మరి ఇందులో వాస్తవం ఏంటి అనేది మంచు ఫ్యామిలీ నోరు విప్పితే గాని తెలియదు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి