
గమ్ గమ్ గణేశా అనే సినిమాకు నిర్మాతగా పనిచేసిన కేదార్ అనే వ్యక్తి మరణించారు. కాసేపటికి క్రితమే ఈ విషయం బయటకు వచ్చింది. టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన నిర్మాత కేదార్ దుబాయిలో మరణించినట్లు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో కేదార్ బాధపడుతున్నారట. ఎన్ని ఆసుపత్రులు తిరిగినా.. ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగు కావడం లేదని చెబుతున్నారు.
అయితే ఇటీవల... దుబాయిలో మంచి వైద్యం అందిస్తారని దగ్గరి వారు... ఆయన కుటుంబంతో సహా దుబాయ్ కి షిఫ్ట్ అయ్యారట. అక్కడే ఉన్నత శ్రేణి వైద్యులతో... తన అనారోగ్యం పైన శ్రద్ధ పెట్టారట. గత కొన్ని రోజులుగా దుబాయ్ కి సంబంధించిన కొంతమంది ప్రముఖ వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే తాజాగా... ఆయన విషమంగా మారిందని అంటున్నారు.
పరిస్థితి చేయి దాటడంతో... వైద్యులు కూడా చేతులెత్తేసారట. ఈ తరుణంలోనే గం గం గణేశా సినిమా నిర్మాత కేదార్... మరణించారు. ఇవాళ మధ్యాహ్నం రెండు గంటల సమయంలో కేదర్ మరణించినట్లు చెబుతున్నారు. ఇక ఈ విషయం తెలియగానే కుటుంబ సభ్యులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. నిర్మాత కేదార్ కు ఒక కూతురు కూడా ఉంది. అటు కేదార్ మరణ వార్త వినగానే టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. "గంగం గణేశా" సినిమా నిర్మాత కేదార్ అంత్యక్రియలు రేపు జరిగే ఛాన్స్ ఉంది.