నటి సమంత గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఈ చిన్నది తన సినిమాల ద్వారా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. అతి తక్కువ సమయంలోనే తెలుగు చలనచిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన హీరోయిన్లలో ఈ చిన్నది ఒకరని చెప్పవచ్చు. ఏ మాయ చేసావే సినిమాతో తెలుగు పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చిన ఈ చిన్నది మొదటి సినిమాతోనే సక్సెస్ అందుకుంది. ఆ సినిమా అనంతరం ఎంతో మంది స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా చేసి తనకంటూ పేరు ప్రఖ్యాతలు దక్కించుకుంది. టాలీవుడ్ నటుడు అక్కినేని నాగచైతన్యను ప్రేమించి వివాహం చేసుకుంది.


అతి తక్కువ సమయంలోనే ఈ జంట విడాకులు తీసుకున్నారు. విడాకుల అనంతరం నాగచైతన్య నటి శోభితను ప్రేమించి వివాహం చేసుకున్నాడు. కానీ సమంత మాత్రం ఇప్పటికీ సింగిల్ గానే ఉంది. తన పర్సనల్ లైఫ్ పక్కన పెడితే సినిమాల పరంగా ఈ చిన్నది తన జోరు కొనసాగిస్తోంది. బాలీవుడ్ లోకి సైతం ఈ చిన్నది ఎంట్రీ ఇచ్చింది. బాలీవుడ్ లో పలు వెబ్ సిరీస్ లలో నటించి తనకంటూ హిందీ పరిశ్రమలో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటుంది. తన నటనకు గాను ఎన్నో అవార్డులను అందుకుంటు కెరీర్ మీద ఫోకస్ పెడుతోంది. 


తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని అభిమానుతో షేర్ చేసుకుంటూ ఉంటుంది. సమంత ఇన్ స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్బుక్ వేదికలలో చాలా యాక్టివ్ గా ఉంటారు. ఇప్పుడు సమంత సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఎక్స్ లోకి కూడా రీ ఎంట్రీ ఇచ్చారు. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే సమంత ఇప్పుడు ఎక్స్ లో కూడా యాక్టివ్ గా మారెందుకు సిద్ధపడ్డారు. 


ఇక సమంత రీసెంట్ గా నిర్మాతగా కూడా మారిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సమంత "శుభం" సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమాకు సంబంధించిన విషయాలను తెలియజేస్తూ సమంత ఎక్స్ లో పోస్ట్ చేశారు. కాగా సమంతకు ఇప్పటికే ఎక్స్ లో 10.2 మిలియన్లకు పైనే ఫాలోవర్లు ఉండడం విశేషం. ఇక ఇప్పుడు సమంత ఎక్స్ లోకి రీ ఎంట్రీ ఇవ్వడంతో తన అభిమానులు ఎక్స్ వేదికగా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: