- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

తెలుగులోనే కాకుండా మన సౌత్ లోనే మంచి ఫాలోయింగ్ క్రేజ్ ఉన్న హీరో సూర్య .. టాలీవుడ్ లో ఈయనకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది .. సూర్య నటిస్తున్న కొత్త మూవీ  ‘రెట్రో’ మే 1న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది .. అయితే ఈ సినిమాకు తెలుగులో చెప్పుకోదగ్గ క్రేజ్ అయితే రావడం లేదు .. సూర్య గత సినిమా కంగువా భారీ డిజాస్టర్ గా మారింది .. పాన్ ఇండియా లెవెల్ లో పెద్ద సంచలనంగా మారుతుంద ని ఎన్నో ఆశలు పెట్టుకున్న సినిమా భారీ దెబ్బకొట్టింది .. ఆ సినిమా ఎఫెక్ట్ ఇప్పుడు రెట్రో  మూవీ పై కూడా పడింది .. కంగువా తెలుగు హక్కులు 22 కోట్లకు పైగా వెళ్లాయి .. రెట్రో బిజినెస్ సగానికి సగం పడిపోయింది .. ఇక రెట్రో తెలుగు హక్కులు కనీసం 10 కోట్లకే అమ్ముడయ్యాయి ..

 

డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు కు కూడా తెలుగులో సరైన హిట్‌ లేదు .  ఇలా సరైన బజ్‌ లేకపోవడానికి ఇది కూడా ఒక రీజ‌న్ .. ఇక హీరోయిన్ పూజ హెగ్డే క్రేజీ కూడా కలిసి రావటం లేదు .. రీసెంట్ గా వచ్చిన ట్రైలర్ కూడా సినిమా పై అంచునాలు పెంచలేకపోయింది .. ట్రైలర్ ని ఎంతో కొత్తగా కట్ చేశారు కానీ కథేంటో కొన్సెప్ట్ ఏమిటో ఇంకా ఎవరికి అర్థం కాకుండా పోయింది .. ఇక ఈ సినిమా గురించి మాట్లాడుకోవడానికి కూడా ఇంకా మ్యాటర్  ఇవ్వలేకపోయింది ట్రైలర్ .. పాటలు జనంలోకి వెళ్లిన కొంత బజ్‌ వచ్చేది .. ఇక్కడ అన్నిటి కంటే ముఖ్యంగా నాని హిట్ 3 రూపంలో సూర్య సినిమాకి గట్టి పోటీ ఉంది .. కంగువా రిజల్ట్ య‌వేరేజ్ గా ఉన్న ఇప్పుడు రెట్రో పరిస్థితి ఎంత దారుణంగా ఉండేది కాదు .. ఒక డిజాస్టర్ సినిమా కష్టాలు ఎలా ఉంటాయో సూర్య ఇప్పుడు కంగువా పుణ్యమా అని ప్రత్యక్షంగా తెలుసుకుంటున్నాడు ..

మరింత సమాచారం తెలుసుకోండి: