ప్రస్తుత ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఫోన్ అనేది ఉంటుంది. అందులో తప్పనిసరిగా వాట్సాప్ క్రియేట్ చేసుకుని ఉంటారు. దానిద్వారా చాటింగ్ చేయడం, ఫోటోలు షేర్ చేసుకోవడం వంటివి వాడుతూ ఉంటారు. ఇదే కాకుండా వాట్స్అప్ లో ఫ్యామిలీ, ఫ్రెండ్స్ గ్రూప్స్ కూడా ఉంటాయి. అయితే కేవలం సాధారణ జనాలకి కాకుండా తెలుగు సినిమా ఇండస్ట్రీలో  హీరో, హీరోయిన్లకు కలిపి ఒక వాట్సాప్ గ్రూప్ ఉందట. అందులో ముఖ్యంగా అల్లు అర్జున్, రామ్ చరణ్, రాణా, నాని సీక్రెట్ గా వాట్సాప్ గ్రూప్ చేసుకున్నారట. అయితే ఆ వాట్సాప్ గ్రూప్ గురించి ఒక ఇంటర్వ్యూలో నాని పలు విషయాలను బయటపెట్టారు. అవేంటో చూద్దామా.. ఒక పది నెలల క్రితం మంచు లక్ష్మివాట్సాప్ గ్రూప్ కి సంబంధించినటువంటి స్క్రీన్ షాట్లను సోషల్ మీడియాలో పంచుకుందని నాని తెలియజేశారు. 

అయితే అప్పట్లో ఈ వాట్సప్ గ్రూపులో చాలా యాక్టివ్ గా ఉండేవారని ప్రస్తుతం ఎవరూ కూడా అంతగా పట్టించుకోవడం లేదని అన్నారు. వాళ్లని అనడం కాదు నేను కూడా ఆ గ్రూపులో మెసేజ్ లను చూడటం లేదని తెలియజేశారు. ఆ గ్రూప్ క్రియేట్ చేసిన మొదట్లో చాలా యాక్టివ్ గా ఉండేవాళ్ళం జోకులు వేసుకునే వాళ్ళం. రాను రాను  ఆ గ్రూప్ కి ఆదరణ తగ్గి చాలామంది నటీనటులు ఫోన్ నెంబర్లు కూడా మార్చేశారు. మేమంతా ఎప్పుడు టచ్ లో ఉండాలనే గ్రూప్ పెట్టుకున్నాం. కానీ కొన్ని రోజులకు ఆ గ్రూపు సాధారణ గ్రూప్ లా మారిపోయి అన్ని విషయాలను పంచుకునే స్థాయికి వెళ్ళింది.

 ముఖ్యంగా ఈ గ్రూపు ద్వారా వారి వారి సినిమాల ట్రైలర్స్ ఇతర విషయాలు చెప్పుకొని ఒకరికొకరు కామెంట్లు పెట్టుకొని  చర్చించుకునేవాళ్లం. కానీ ఇప్పుడు ఆదరణ తగ్గిపోయి ప్రతి విషయాన్ని అందులో షేర్ చేస్తున్నారు. అందుకే ఆ గ్రూపుని నేను మ్యూట్ లో పెట్టుకున్నానని చెప్పుకొచ్చారు. అయితే ఈ వాట్సప్ గ్రూప్ లో నేనే కాకుండా  అల్లు అర్జున్, రామ్ చరణ్, రానా వంటి హీరోలు కూడా ఉన్నారు. వాళ్ల మెసేజ్ లు కూడా నేను చూడకుండా మ్యూట్ లో ఉంచానని నాని చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: