
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను కోలీవుడ్ క్రేజీ దర్శకుడు అట్లీతో చేయబోతున్నట్లు ఇటీవల అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమా భారీ బడ్జెట్‌తో హెవీ వీఎఫ్ఎక్స్ వర్క్స్‌తో తెరకెక్కుతోంది. ఈ సినిమా నెవ్వర్ బిఫోర్ కథతో ప్రేక్షకుల ముందుకు వస్తోందని కూడా మేకర్స్ చెపుతున్నారు. అయితే ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ వార్త ఇప్పుడు సినిమా వర్గాల్లో చక్కెర్లు కొడుతోంది.
ఈ క్రేజీ ప్రాజెక్టులో హీరోయిన్ గా ‘ సీతా రామం ’ ఫేమ్ మృణాల్ ఠాకూర్ సెలెక్ట్ అయ్యిందంటున్నారు. అల్లు అర్జున్‌తో మృణాల్ ప్రెష్ పెయిర్‌గా ప్రేక్షకులను మెప్పిస్తుందనే అట్లీ ఆమె - బన్నీని కలిపి లుక్ టెస్ట్ చేసి మరీ ఎంపిక చేశారట. ఇక మరో హీరోయిన్ గా దేవరతో సౌత్ లో కాలుమోపిన జాన్వీ కపూర్ నటించబోతోందట. ఇక వీరిద్దరి తో పాటు మూడో హీరోయిన్ కూడా ఉంటుందంటున్నారు. . ముగ్గురు హీరోయిన్లతో ఈ సినిమా క్రేజ్ నెక్ట్స్ లెవల్‌కు వెళుతుందని చిత్ర యూనిట్ చెపుతోంది. ఇక బన్నీ తన కెరీర్ లో ఫస్ట్ టైం డబుల్ రోల్లో కనిపించబోతున్నాడు. సన్ వాళ్లు భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
ఈ వాట్సాప్ నెంబర్‌తో సమస్య మీది.. పరిష్కారం మాది..
అవినీతి అయినా.. లంచాలైనా.. రాజకీయ నాయకులు పెట్టే ఇబ్బందులు అయినా మీ సమస్యను మా సమస్యగా భుజాన వేసుకుంటాం. నేతలు పట్టించుకోవడం లేదని.. అధికారులు దురుసుగా వ్యవహరిస్తున్నారని చింతించాల్సిన అవసరమే లేదు. రండి.. చేయి చేయి కలుపుదాం.. మీ చింత తీర్చుదాం. మీ సమస్య ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.. పరిష్కార మార్గాన్ని పొందండి.
నోట్ : వ్యక్తిగత, కుటుంబ సమస్యలు వద్దు