ఇన్నాళ్లు సోషల్ మీడియాలో మెగా వర్సెస్ అల్లు ఫ్యాన్స్ మధ్య వార్ హిట్ పెంచేసింది . ఇప్పుడు మెగా వెర్సెస్ నందమూరి వార్ స్టార్ట్ అవ్వబోతున్నట్లు మాట్లాడుకుంటున్నారు జనాలు.  మనకు తెలిసిందే  సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ కి హై ఫ్యాన్ బేస్  ఉంది . అలాగే నందమూరి ఫ్యామిలీ హీరోస్ కి కూడా సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది.  అయితే మెగాస్టార్ చిరంజీవి ఎప్పుడూ ఆ విషయంలో టాప్ లో ఉంటాడు . కాగా మెగాస్టార్ చిరంజీవి తన 157వ సినిమాను అనిల్ రావిపూడి డైరెక్షన్ లో లాక్ అయిన విషయం అందరికీ తెలిసిందే.


సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కాబోతుంది . ఈ షూటింగ్ కంటే ముందే సినిమా రిలీజ్ డేట్ ను కన్ఫర్మ్ చేసేసాడు అనిల్ రావిపూడి.  2026 సంక్రాంతి సందర్భంగా ఈ సినిమాను థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి ఫిక్స్ అయిపోయారు . అనిల్ రావిపూడి మాటంటే మాటే టైమింగ్ అంటే టైమింగ్ . చెప్పిన మాట కచ్చితంగా చేస్తాడు.. అదే టైంకి సినిమాని థియేటర్స్ లో రిలీజ్ చేస్తాడు . అయితే ఇక్కడ ఇప్పుడు ఒక బిగ్ సమస్య వచ్చి చేరింది. 2026 సంక్రాంతికి జూనియర్ ఎన్టీఆర్ కమిట్ అయిన "డ్రాగన్" సినిమా కూడా రిలీజ్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది .



జూనియర్ ఎన్టీఆర్ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ మూవీ ఫిక్స్ అయింది . జనవరి లో ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది . అయితే ఇంచుమించు సంక్రాంతి సందర్భంగానే ఈ సినిమాని రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారట మేకర్స్ . అదే నిజమైతే మాత్రం 2002 సీన్ రిపీట్ అయినట్టే . సంక్రాంతి కానుకగా 2002లో చిరంజీవి నటించిన "ఇంద్ర" సినిమా కంటే ఐదు రోజులు ముందు ఎన్టీఆర్ నటించిన "అల్లరి రాముడు" సినిమా రిలీజ్ అయింది. ఈ రెండు సినిమాలకు ఒకే డైరెక్టర్ కావడం గమనార్హం. కాగా ఇప్పుడు 2002 సంవత్సరంలో  రిపీట్ అయిన మళ్లీ రిపీట్ కాబోతుంది అని 2026 లో కూడా అదే విధంగా చిరంజీవి - జూనియర్ ఎన్టీఆర్ పోటీ పడబోతున్నారు బాక్సాఫీస్ వద్ద అని మాట్లాడుకుంటున్నారు జనాలు . సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే న్యూస్ బాగా ట్రెండింగ్ లోకి వచ్చింది..!

మరింత సమాచారం తెలుసుకోండి: