యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సినీ బ్యాగ్రౌండ్ ఉన్న కుటుంబం నుంచి సినిమాల్లోకి వచ్చిన ఎన్టీఆర్ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక ఎన్టీఆర్ ఇప్పటివరకు ఎన్నో బ్లాక్బస్టర్ హిట్ సినిమాలలో నటించి సక్సెస్ఫుల్ స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు. రీసెంట్ గా ఈ హీరో నటించిన దేవర సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇందులో ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ నటించింది. ఇక ఈ సినిమా అనంతరం ఎన్టీఆర్ డ్రాగన్ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాకు ప్రశాంతం నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. 

సినిమా షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. కాగా, ఈ సినిమాలో హీరోయిన్లకు సంబంధించి అనేక రకాల వార్తలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే డ్రాగన్ సినిమాలో హీరోయిన్లకు సంబంధించిన ఓ అప్డేట్ వెలువడింది. ఇందులో ఎన్టీఆర్ కు జోడిగా యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటించబోతున్నట్లుగా తెలుస్తోంది. దీంతో వీరిద్దరి కెమిస్ట్రీ బిగ్ స్క్రీన్ పైన ఎలా ఉంటుందో చూడాలని అభిమానులు అంటున్నారు. ఇక రుక్మిణి వసంత్ తో పాటు స్టార్ హీరోయిన్ శృతిహాసన్ కూడా ఎన్టీఆర్ కు జోడీగా నటిస్తోంది.

శృతిహాసన్, ఎన్టీఆర్ మద్య ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ఉండబోతుందట. ఇక మూడో హీరోయిన్ గా డ్రాగన్ సినిమాలో 'ప్రేమలు' సినిమాతో మంచి గుర్తింపు అందుకున్న యంగ్ బ్యూటీ మమత బైజు కూడా ఎన్టీఆర్ సరసన ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించబోతుందని సమాచారం అందుతోంది. ఈ ముగ్గురితో కలిసి ఎన్టీఆర్ డ్రాగన్ సినిమాలో రొమాన్స్ చేయనున్నారట. ఈ ముగ్గురు హీరోయిన్లకు సంబంధించి సోషల్ మీడియా మాధ్యమాలో అనేక రకాల వార్తలు వైరల్ అవుతున్నప్పటికీ దీనిపై చిత్ర బృందం నుంచి ఏదో ఒక క్లారిటీ వస్తే కానీ అసలు విషయం బయటికి రాదు.

మరింత సమాచారం తెలుసుకోండి: