గత కొంతకాలంగా టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక జంట ప్రేమలో ఉన్నారనే ప్రచారం అయితే జరుగుతోంది. ఈనెల 26వ తేదీన రాజస్థాన్లోని ఉదయపూర్ లో వీరు వివాహం చేసుకోబోతున్నట్లు వినిపిస్తున్నాయి. ఈ విషయం పైన ఇంతవరకు ఏ ఒక్కరు కూడా క్లారిటీ ఇవ్వలేదు. కేవలం కుటుంబ సభ్యులు మరియు స్నేహితుల సమక్షంలోనే ఈ వేడుక చాలా గ్రాండ్గా నిర్వహించబోతున్నట్లు వినిపిస్తున్నాయి. ఉదయ్ పూర్ లో వివాహం ముగిసిన తర్వాత హైదరాబాదులో పెద్ద ఎత్తున రిసెప్షన్ ఏర్పాటు చేయబోతున్నట్లు సమాచారం.


ఆ రిసెప్షన్ మార్చి 4వ తేదీన హైదరాబాదులోని ఒక ప్రముఖ కన్వెన్షన్ సెంటర్లో భారీ ఎత్తున వెడ్డింగ్ రిసెప్షన్ ని ఏర్పాటు చేయబోతున్నారు. ఈ వేడుకకు టాలీవుడ్ ప్రముఖులతో పాటు కోలీవుడ్ ,బాలీవుడ్ సినీ ప్రముఖులు కూడా పెద్ద సంఖ్యలో హాజరయ్యే అవకాశాలు ఉన్నట్లు వినికిడి. అయితే ఇప్పటికే ఆహ్వాన పత్రికలు కూడా సిద్ధమయ్యాయని మంచి రోజు చూసి పంపించే ఏర్పాటు కూడా చేస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ పెళ్లికి సంబంధించి ఇప్పటివరకు అధికారికంగా ఏ ఒక్కరు కూడా స్పందించలేదు. కానీ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో ఈ జంట షేర్ చేసే కొన్ని ఫోటోలు నిజమనే నమ్మేలా చేస్తుంటాయి.


కానీ వివాహానికి సంబంధించి తేదీలు, వేదిక వంటి వివరాలు కూడా వినిపిస్తూ ఉండడంతో అబిమానులు ఖుషీ అవుతున్నారు. రష్మిక, విజయ్ దేవరకొండ కలిసి గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ వంటి చిత్రాలలో నటించారు. ఈ సినిమాల సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించిందని ఆ ప్రేమ బంధాన్ని పెళ్లి వరకు తీసుకువెళ్లబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రష్మిక పాన్ ఇండియా లెవెల్ లో తన సినిమాలతో వరుస సక్సెస్ లో అందుకుంటోంది. విజయ్ దేవరకొండ చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. ఈ సినిమాలతో సరైన సక్సెస్ అందుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: