
టాలీవుడ్ మీ అన్న మోసెస్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు నటిస్తున్న సినిమాలలో మోస్ట్ అవైటెడ్ క్రేజీ ప్రాజెక్టు ప్రశాంత్ నీల్ తో చేస్తున్న సినిమా అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్తో కలిసి ఎన్టీఆర్ నటిస్తున్న వార్ 2 సినిమాతో పాటు ప్రశాంత నీల్ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా నడుస్తోంది. ఈ సినిమాకు డ్రాగన్ అనే వర్కింగ్ టైటిల్ పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. ఎన్టీఆర్ కెరీర్ లో 31వ సినిమాగా భారీ పాన్ ఇండియా సినిమాగా వస్తున్న ఈ సినిమాపై ఎక్కడా లేని అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా నుంచి మేకర్స్ రీసెంట్ గానే రెండు సాలిడ్ అప్డేట్లు కూడా ఇచ్చేశారు. ఈ సినిమా తాలూకూ కొత్త రిలీజ్ డేట్ అలాగే గ్లింప్స్ రిలీజ్ కూడా ఖరారు చేశారు. ఈ సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ బ్లాక్ చేసినట్టు ఎప్పటినుం రూమర్లు ఉన్నాయి. టైటిల్ సహా గ్లిమ్స్ అలాగే క్రేజీ మాస్ పోస్టర్స్ అన్నీ కూడా జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు కానుకగా ఇప్పుడు బయటకు రానున్నట్లు తెలుస్తోంది.
మరి ఫైనల్ గా ప్రశాంత్ నీల్ డ్రాగన్ అనే టైటిల్ పెడతారా ? లేదా మరో టైటిల్ పెడతారా అన్నది వేచి చూడాలి. ఇక ఈ సినిమా టైటిల్ గ్లింస్ అయితే మే 19 లేదా 20 అయినా రావచ్చు అని తెలుస్తుంది. ఇక ఈ సినిమా వచ్చే ఏడాది జూన్ 25న రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ లాక్ చేశారు. ఈ రెండు సినిమా లు పూర్తయిన వెంటనే ఎన్టీఆర్ సూపర్ హిట్ సినిమా దేవరకు సీక్వెల్ గా తెరకెక్కే దేవర 2 పనుల్లో కి వెళ్లిపోతాడు. కొరటాల ఇప్పటికే దేవర 2 స్క్రిప్ట్ పనులు పూర్తి చేసే పనిలో ఉన్నారు.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు