- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ )

ఇప్పుడు మన టాలీవుడ్ ఆడియన్స్ నుంచి ఎగ్జిటైడ్ గా ఎదురు చూస్తున్న సినిమా ఏదైనా ఉంది అంటే అది నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన హిట్ 3 సినిమా అని చెప్పాలి. ఈ ఏడాది టాలీవుడ్ లో సరైన సినిమా రాలేదని మంచి కమర్షియల్ మాస్ సినిమా కావాలని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. అటు థియేటర్లు కూడా చాలా వరకు ఖాళీగా దర్శనం ఇస్తున్నాయి. ఇలాంటి టైంలో హిట్ లాంటి అదిరిపోయే సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్ గా వస్తున్న హిట్ 3 సినిమా రిలీజ్ డేట్ దగ్గరికి వస్తున్న సమయంలో ప్రపంచ వ్యాప్తంగా బుకింగ్స్ గట్టిగానే కనిపిస్తున్నాయి. మెయిన్ గా ఓవర్సీస్ మార్కెట్ తో పాటు నైజాం లో నాని కెరీర్ హైయెస్ట్ ఓపెనింగ్స్ దసరా సినిమాకు వచ్చాయి.  అయితే ఇప్పుడు హిట్ 3 సినిమాకు దసరా సినిమాకి మించి నటువంటి ఓపెనింగ్స్ వ‌చ్చేలా ట్రెండ్‌ కనిపిస్తోంది.


ఏపీలో కూడా ఎలాగో హైక్స్ దక్కనుండగా ... ఈ సినిమాతో మాత్రం నాని దసరా ఓపెన్స్ బ్రేక్ చేసేసేలా ఉన్నాడని ట్రేడ్ వర్గాలలో వినిపిస్తోంది. మరి హిట్ 3 సినిమాకి ఏ రేంజ్ ఓపెనింగ్స్‌ లభిస్తాయి అనేది వేచి చూడాలి. ఇక ఈ సినిమాకు శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తుండగా ... పలు క్రేజీ సర్ప్రైజ్లు కూడా ఈ సినిమాలో ఉంటాయని తెలుస్తోంది. నానిసినిమా కోసం నార్త్ ఇండియాలో భారీ స్థాయిలో ప్రమోషన్లు చేస్తున్నారు. అటు నార్త్ ఇండియా కూడా ఈ సినిమాకు అదిరిపోయే ఓపెనింగ్స్ వస్తాయి.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: