టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎంతో మంది హీరోయిన్లు ఉన్న విషయం తెలిసిందే. అందులో కొంతమంది మాత్రమే వారి నటన, అంద చందాలతో మంచి గుర్తింపును సంపాదించుకుంటారు. అలాంటి వారిలో నటి రీతు వర్మ ఒకరు. ఈ చిన్నది అతి తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. తెలుగులో అనేక సినిమాలలో కీలకపాత్రలను పోషించింది. ఈ చిన్నది పెళ్లిచూపులు సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు అందుకుంది. ఈ చిన్నది హీరోయిన్ గా పలు సినిమాలలో అవకాశాలను అందుకుంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటించి ప్రేక్షకుల ప్రశంసలు పొందింది. 

తెలుగుతోపాటు తమిళంలోను అనేక సినిమాలు చేసింది. ఈ చిన్నది సక్సెస్ఫుల్ హీరోయిన్ గా తన కెరీర్ కొనసాగిస్తుంది. ఈ క్రమంలోనే రీతు వర్మకు సంబంధించిన ఓ వార్త గత కొద్దిరోజుల నుంచి సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ గా మారుతుంది. ఈ చిన్నది మెగా హీరోతో సీక్రెట్ గా రిలేషన్ కొనసాగిస్తున్నట్లుగా వార్తలు వైరల్ అవుతున్నాయి. మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తో చాలా కాలం నుంచి ప్రేమలో ఉన్నట్లుగా తెలుస్తోంది. కొద్ది రోజుల తర్వాత వీరిద్దరూ వివాహం చేసుకోవాలని అనుకుంటున్నారట. వీరి వివాహానికి ఇరు కుటుంబ సభ్యులు ఒప్పుకున్నట్లుగా సమాచారం అందుతుంది.

అంతేకాకుండా రీతు వర్మ మెగా కుటుంబంలో ఎలాంటి ఫంక్షన్, ఈవెంట్ అయినా సరే తప్పకుండా వెళుతుంది. అక్కడ మెగా కుటుంబ సభ్యులతో కలిసి ఎంజాయ్ చేస్తోంది. వారితో ఫోటోలు దిగి సోషల్ మీడియాలో షేర్ చేసుకోగా అవి విపరీతంగా వైరల్ అవుతాయి. వీరిద్దరి ప్రేమ వ్యవహారంపై సోషల్ మీడియాలో చాలా రోజుల నుంచి అనేక రకాల వార్తలు వైరల్ అవుతున్నప్పటికీ రీతు వర్మ కానీ, సాయి ధరమ్ తేజ్ కానీ ఈ వార్తలపై ఇంతవరకు స్పందించలేదు. ఈ విషయంలో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాలంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: