ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. గంగోత్రి సినిమాతో తెలుగు చలన చిత్ర పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్ మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు అందుకున్నారు. ఆ సినిమా అనంతరం వరుసగా సినిమాలలో నటించి ప్రేక్షకుల ప్రశంసలు పొందారు. ఇప్పటివరకు తన కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలలో నటించి సక్సెస్ఫుల్ స్టార్ హీరోగా తన కెరీర్ కొనసాగిస్తున్నారు. అత్యధిక రెమ్యూనరేషన్ వసూలు చేసే హీరోల జాబితాలో అల్లు అర్జున్ ముందు వరుసలో ఉంటాడు. ఈ హీరో నటించిన తాజా చిత్రం 'పుష్ప-2'. ఈ సినిమా అల్లు అర్జున్ కెరీర్ లోనే అత్యంత ఎక్కువ కలెక్షన్లు రాబట్టిన సినిమాగా నిలిచింది. 

ఇందులో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన హీరోయిన్ గా నటించారు. పుష్ప-2 సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా రిలీజ్ అయ్యి చాలా రోజులే అవుతున్నప్పటికీ అల్లు అర్జున్ ఇంతవరకు ఎలాంటి సినిమా షూటింగ్ లలో పాల్గొనడం లేదు. తన తదుపరి సినిమాను డైరెక్టర్ అట్లీతో కలిసి తీయబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పూజ కార్యక్రమాలను అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా నిర్వహించారు. ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ అప్డేట్ బయటకు వచ్చింది. "AA 22" అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. ఇందులో అల్లు అర్జున్ సరసన హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండేను ఎంపిక చేసినట్టుగా సమాచారం అందుతుంది.

రీసెంట్ గానే "కేసరి-2" తో మంచి సక్సెస్ అందుకున్న ఈ భామను హీరోయిన్ గా ఫైనల్ చేసినట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన మరో హీరోయిన్ ని కూడా అనుకుంటున్నారట. నటి మృణాల్ ఠాకూర్ ను కూడా ఈ సినిమాలో హీరోయిన్ గా ఫైనల్ చేశారట. అనన్య పాండే, మృణాల్ ఠాకూర్ తో కలిసి అల్లు అర్జున్ నటించబోతున్నారు  ఇక ఈ సినిమాను రూ. 600 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించనున్నారు. ఈ సినిమా ఏ మేరకు కలేక్షన్లను రాబడుతుందో చూడాలి. కాగా ఈ సినిమా షూటింగ్ ను త్వరలోనే ప్రారంభించి వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలని అట్లీ భావిస్తున్నారట. ఈ సినిమాకు సంబంధించి మరింత సమాచారం వెలువడాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: