మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ హాటెస్ట్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె ఇప్పటి వరకు ఎన్నో తెలుగు సినిమాల్లో నటించి అందులో చాలా మూవీలతో మంచి విజయాలను అందుకొని టాలీవుడ్ ఇండస్ట్రీ లో తనకంటూ ఒక అద్భుతమైన గుర్తింపును ఏర్పరచుకుంది. ఇకపోతే ఈ బ్యూటీ కెరియర్ ప్రారంభంలో ఎక్కువ శాతం క్లాస్ అండ్ డీసెంట్ పాత్రలలో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంది. అలా కెరీర్ను కొనసాగిస్తున్న సమయం లోనే ఈమె రౌడీ బాయ్స్ అనే సినిమాలో నటించింది. ఈ మూవీ లో ఈ బ్యూటీ భారీ స్థాయిలో అందాలను ఆరబోసింది.

మూవీ తర్వాత ఈమె టిల్లు స్క్వేర్ మూవీ లో రౌడీ బాయ్స్ మూవీ కి మించిన రేంజ్ లో అందాలను ఆరబోసింది. ఈ రెండు మూవీ ల ద్వారా ఈమెకు గ్లామర్ బ్యూటీ గా కూడా పేరు వచ్చింది. ప్రస్తుతం ఈ బ్యూటీ అనేక సినిమాలో నటిస్తూ అద్భుతమైన రీతిలో కెరియర్ను ముందుకు సాగిస్తుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ పరదా అనే లేడీ ఓరియంటెడ్ సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తోంది. ఈ మూవీ నుండి మేకర్స్ విడుదల చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.

అలాగే ఈమె బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా రూపొందుతున్న కిష్కిందపురి అనే సినిమాలో కూడా హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా రూపొందిన రాక్షసుడు మూవీ మంచి విజయం సాధించడంతో కిష్కిందపురి సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇలా అనుపమ పరమేశ్వరన్ ప్రస్తుతం వరుసగా సినిమాల్లో నటిస్తూ వస్తుంది. ప్రస్తుతం అనుపమ పరమేశ్వరన్ నటిస్తున్న ఈ రెండు సినిమాలు కనుక మంచి విజయాలను సాధించినట్లయితే ఈ బ్యూటీ క్రేజ్ తెలుగు సినీ పరిశ్రమలో మరింత పెరిగే అవకాశం చాలా వరకు ఉంది అని అనేక మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: