నేచురల్ స్టార్ నానిహీరో గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అతి తక్కువ సమయంలోనే చిత్ర పరిశ్రమకు హీరోగా పరిచయమై మంచి గుర్తింపు అందుకున్నారు. అష్టా చమ్మా సినిమాతో తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చిన ఈ హీరో ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. నాని సినిమా వస్తుందంటే చాలు అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తారు. ఇప్పటివరకు తన కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక నాని హీరోగా మాత్రమే కాకుండా నిర్మాతగాను వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. 

తన సొంతంగా నిర్మాణ సంస్థను స్థాపించి అనేక సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. ఇక ఈ హీరో నటించిన తాజా చిత్రం హిట్ 3. ఈ సినిమా మే 1వ తేదీన రిలీజ్ అయ్యి పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంది. ఈ సినిమాకు అభిమానులు పెద్దగా కనెక్ట్ అవ్వలేకపోయారు. హిట్ 1, హిట్ 2 సినిమాలు సాధించినంత విజయాన్ని హిట్ 3 సినిమా సాధించలేకపోవచ్చనే అనుమానాలు సైతం వ్యక్తం అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ అప్డేట్ బయటకు వచ్చింది.

హిట్ 3 సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ అయింది. ఈ సినిమాను ప్రముఖ డిజిటల్ ప్లాట్ ఫామ్ ఓటీటీ సంస్థ హిట్ 3 సినిమా రైట్స్ ను రూ. 54 కోట్లను వెచ్చించి స్ట్రీమింగ్ రైట్స్ సొంతం చేసుకున్నట్లుగా సమాచారం అందుతుంది. ఈ నెల చివర్లో లేదా జూన్ మొదటి వారంలో హిట్ 3 సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నట్లుగా సమాచారం అందుతుంది. ఈ సినిమాకు శైలేష్ కొలను దర్శకత్వం వహించారు. నాని సరసన హీరోయిన్ గా శ్రీనిధి శెట్టి నటించింది. ప్రస్తుతం ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఎప్పటినుంచో నాని అభిమానులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: