
నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన హిట్ 3 మూవీ సూపర్ డూపర్ హిట్ టాక్ అందుకుంది. ఈ సినిమాకి సంబంధించిన ప్రతి ఒక్క వార్త జెట్ స్పీడ్ లో ట్రెండ్ అవుతుంది. అంతేకాదు నాని పర్ఫామెన్స్ గురించి మిగతా ఇండస్ట్రీకి సంబంధించిన నటీనటులు ట్విట్టర్ వేదికగా స్పందిస్తున్నారు. అయితే గతంలో ఇదే మాదిరిగా ఉదయ్ కిరణ్ ని సైతం ఓ రేంజ్ లో పొగిడేసి చెట్టు మీదకు ఎక్కించేశారు జనాలు. ఉదయ్ కిరణ్ చేసిన ప్రతి సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతున్న మూమెంట్లో ఉదయ్ కిరణ్ ని ఓ రేంజ్ లో పొగిడేసారు టాలీవుడ్ సినీ ప్రముఖులు .
ఇండస్ట్రీకి దొరికిన ఆణిముత్యం అని ..ఇండస్ట్రీని ఎక్కడికో తీసుకెళ్లి పోయే సత్తా ఉండే నటుడు ఉదయ్ కిరణ్ అని ఒకటా రెండా ఎన్నెన్నో మాట్లాడుకున్నారు . సీన్ కట్ చేస్తే ఉదయ్ కిరణ్ పరిస్థితి ఎలా మారిపోయింది అనే విషయం అందరికీ తెలిసిందే . ఇప్పుడు నానిని కూడా అదే రేంజ్ లో పైకి ఎక్కిచ్చేస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో ఉదయ్ కిరణ్ తో నానిని కంపేర్ చేస్తున్నారు కొంత మంది జనాలు. అంతేకాదు మరికొంత మంది నానికి సజెషన్స్ ఇస్తున్నారు. నాని నువ్వు అలాంటి మాటలు విని మోసపోకు ..సొంత టాలెంట్ తో పైకి వస్తున్నావ్.. పొగడ్తలను తీసుకోకు విమర్శలను అస్సలు పట్టించుకోకు ..నీ లైఫ్ నీది అంటూ సజెషన్స్ ఇస్తున్నారు. సోషల్ మీడియాలో నాని పేరు ఇప్పుడుమారుమ్రోగిపోతుంది..!