హిందీ సినీ పరిశ్రమలో అద్భుతమైన గుర్తింపు కలిగిన నటులలో అజయ్ దేవగన్ ఒకరు. ఈయన ఇప్పటి వరకు ఎన్నో సినిమాల్లో నటించి వాటిలో ఎన్నో మూవీలతో మంచి విజయాలను అందుకొని బాలీవుడ్ ఇండస్ట్రీ లో తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇకపోతే రామ్ చరణ్ , జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్ ఆర్ ఆర్ అనే తెలుగు సినిమాలో అజయ్ దేవ్ గన్ ఓ కీలకమైన పాత్రలో నటించాడు. ఈ మూవీ మంచి విజయం సాధించడంతో ఈయనకి తెలుగు సినీ పరిశ్రమలో కూడా మంచి గుర్తింపు ఏర్పడింది.

ఇకపోతే అజయ్ దేవ్ గన్ కొంత కాలం క్రితం రైడ్ అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది. ఇక ఈ మూవీ ని తెలుగులో మిస్టర్ బచ్చన్ అనే పేరుతో రీమిక్ చేశారు. కానీ ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయింది. ఇది ఇలా ఉంటే రైడ్ మూవీ మంచి విజయం సాధించడంతో రైడ్ మూవీ కి కొనసాగింపుగా రైడ్ 2 అనే మూవీ ని మేకర్స్ రూపొందించారు. ఇక ఈ సినిమాను తాజాగా థియేటర్లలో విడుదల చేశారు. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్సా ఫీస్ దగ్గర మంచి టాక్ లభించింది.

దానితో ప్రస్తుతం ఈ మూవీ కి అద్భుతమైన కలెక్షన్లు ప్రపంచ వ్యాప్తంగా దక్కుతున్నాయి. ఇకపోతే ఈ సినిమా బుక్ మై షో లో ఒక అద్భుతమైన రేర్ ఫీట్ ను సాధించింది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం బుక్ మై షో లో ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన 1 మిలియన్ టికెట్స్ సేల్ అయినట్లు తెలుస్తోంది. అలా ఈ మూవీ బుక్ మై షో యాప్ లో తన సత్తా చాటుతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: