
అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ మరొకసారి చిరంజీవిని ఘాటుగాట్రోల్ చేసే విధంగా మారిపోయింది . సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం చిరంజీవి తన ఇంట్లో ప్రత్యేకంగా హోమం వేయించబోతున్నారట . అయితే ఇది కుటుంబ సంరక్షణ కోసమో లేకపోతే కుటుంబం హ్యాపీగా ఉండాలి అన్న కారణంగా అయితే కాదు అని..తన ఫ్యామిలీకి వారసుడు రావాలి అని రామ్ చరణ్ - ఉపాసన కి కొడుకు పుట్టాలి అని సపరేట్గా పండితులను పిలిపించి ఇంట్లో ప్రత్యేకంగా మూడు రోజులపాటు హోమం వేయించబోతున్నారట.
ఈ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. అయితే మెగాస్టార్ లాంటి ఒక స్టార్ హీరో వారసుడు కోసం ఇలా కూడా చేస్తారా ..? కొడుకు పుడతాడా..? కూతురు పుడుతుందా..? అనేది ఆ దేవుడి చేతుల్లోనే ఉంటుంది . ప్రత్యేకంగా పూజలు చేస్తే కొడుకులు పడతారా ..? అంటూ ఘాటుగా కౌంటర్ వేస్తున్నారు జనాలు. ఇక ఆకతాయిలు సోషల్ మీడియాలో ఇప్పుడు చిరంజీవిని మరోసారి ట్రోల్ చేస్తున్నారు. కాగా చిరంజీవి ప్రజెంట్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక సినిమాకి కమిట్ అయ్యాడు . ఈ సినిమాలో చిరంజీవి డ్యూయెల్ షేడ్స్ లో కనిపించబోతున్నారట . ఘరానా మొగుడు సినిమా లాంటి చిరంజీవిని ఈ సినిమాలో మనం తెరపై చూడబోతున్నాం అంటూ ఓ న్యూస్ బాగా సర్కులేట్ అవుతుంది..!