
ఇదిలా ఉండగా.. ఇటీవలే ఈ అరుదైన గౌరవం మరో తెలుగు స్టార్ట్ హీరోకి దక్కింది. మరి ఆ స్టార్ హీరో ఎవరని ఆలోచిస్తున్నారా.. అతను ఎవరో కాదు మన మెగాస్టార్ చిరంజీవి కుమారుడు, స్టార్ హీరో రామ్ చరణ్. లండన్ లోని మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో నటుడు రామ్ చరణ్ మైనపు విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయనున్నారు. రామ్ చరణ్ మైనపు విగ్రహాన్ని వచ్చే నెల 9వ తేదీన లంఛ్ చేయనున్నట్లు మ్యూజియం సిబ్బంది ప్రకటించింది. అనంతరం ఆ విగ్రహాన్ని సింగపూర్ టుస్సాడ్స్ మ్యూజియానికి తరలిస్తారని తెలిపింది. ఇక దీనికోసం కొన్ని నెలల క్రితమే రామ్ చరణ్, అలాగే ఆయన పెంపుడు కుక్క రైమ్ కు సంబంధించిన కొలతలను కూడా లండన్ మేడం టుస్సాడ్స్ సిబ్బంది తీసుకుంది. ఈ సందర్భంగా ఆ అరుదైన గౌరవాన్ని చూసేందుకు మెగా ఫ్యామిలీ లండన్ కి వెళ్లారు. చిరంజీవి, ఆయన సతీమణి సురేఖ, రామ్ చరణ్, ఉపాసన, వారి కూతురు క్లీన్ కారాతో పాటుగా రామ్ చరణ్ పెంపుడు కుక్క రైమ్ కూడా లండన్ కి పయనం అయ్యారు.
ఇప్పటికే లండన్ మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో సూపర్ స్టార్ మహేష్ బాబు, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మరియు టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోస్ మైనపు విగ్రహాలు ఉన్నాయి. అలాగే బాలీవుడ్ కి చెందిన అమితాబ్ బచ్చన్, రణబీర్ కపూర్, స్టార్ నటి ఐశ్వర్యారాయ్, హీరో షారుక్ ఖాన్ మైనపు విగ్రహాలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఈ మ్యూజియంలో కేవలం సినిమా ప్రముఖుల మైనపు విగ్రహాలు మాత్రమే ఉంటాయనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే ఈ మ్యూజియంలో సినీ ప్రముఖులతో పాటుగా స్పోర్ట్స్ మరియు అనేక రంగాలకు చెందిన ప్రముఖుల మైనపు విగ్రహాలు కూడా ఉంటాయి.