
ఈ సినిమా వేరే లెవెల్ లో ఉండబోతుంది అంటూ టాక్ బయటకు వచ్చింది . ఇది ఇలా ఉంటే విక్టరీ వెంకటేష్ కోసం త్రివిక్రమ్ అద్దిరిపోయే కథను రాసుకున్నాడు అని .. ఇది పూర్తిగా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా అని "నువ్వు నాకు నచ్చావ్ "..సినిమా టైంలో ఏ రేంజ్ లో ఈ కాంబో అదరగొట్టిందో ఇప్పుడు అంతకు డబుల్ స్థాయిలోనే అదరగొట్టబోతుంది అంటూ ఫ్యాన్స్ ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. కాగా వీళ్ళ సినిమాలో ఇప్పుడు హీరోయిన్గా త్రివిక్రమ్ చూస్ చేసుకున్న బ్యూటీ ఎవరో తెలిస్తే ఖచ్చితంగా షాక్ అయిపోతారు.
ఆమె మరి ఎవరో కాదు "సంయుక్త మీనన్". యస్ ఈ న్యూస్ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది. విక్టరీ వెంకటేష్ పక్కన్న సంయుక్త మీనన్.. ఈ సినిమాలో హీరోయిన్గా నటించబోతుందట. దీనికి సంబంధించిన అన్ని అగ్రిమెంట్ పేపర్లపై సైన్ చేసేసిందట హీరోయిన్ సమ్యుక్తా మీనన్. విక్టరీ వెంకటేష్ తో సంయుక్త మీనన్ క్రేజీ కాంబో .. త్రివిక్రమ అంటేనే క్రేజీనెస్ ఇక త్రివిక్రమ్ - సంయుక్త - విక్టరీ వెంకటేష్ కలిస్తే రచ్చరంబోలానే అంటూ ఈ సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ పెంచేసుకున్నారు అభిమానులు. చూద్దం మరి వీళ్ళ కాంబో ఎలా సెట్ అవుతుందో..?!