ఏంటి బాలీవుడ్ హీరోయిన్ టాలీవుడ్లోకి రావాలనుకుంటుందా? సౌత్ లో ఉన్న హీరోయిన్లందరూ బాలీవుడ్ లో రాణించాలి అనుకుంటే ఈ హీరోయిన్ ఏంటి బాలీవుడ్ నుండి మళ్ళీ టాలీవుడ్ కి రావాలనుకుంటుంది అని చాలామందిలో ఒక ఆశ్చర్యమైతే ఉంటుంది.అయితే  ఇప్పటికే మల్లీశ్వరి అంటే మీకు అర్థమై ఉంటుంది.ఆమెనే బాలీవుడ్ నటి కత్రినా కైఫ్. ఈ మధ్యకాలంలో చాలామంది సౌత్ హీరోయిన్లు అంటే రష్మిక మందన్నా,శ్రీలీల, మీనాక్షి చౌదరి,కీర్తి సురేష్,పూజ హెగ్డే, కృతి శెట్టి,సాయి పల్లవి వంటి ఎంతోమంది హీరోయిన్లు బాలీవుడ్లోకి వెళ్లి అక్కడ రాణించాలి అని తెగ ఆరాటపడుతున్నారు. కానీ బాలీవుడ్ లో ఉన్న హీరోయిన్లు మాత్రం సౌత్ లో రాణించాలి అని కలలు కంటున్నారు. 

అలా బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ అయినటువంటి దీపిక పదుకొనే, అలియాబట్, కియారా అద్వానీ, జాన్వి కపూర్, దిశా పటాని వంటి హీరోయిన్లు టాలీవుడ్ డైరెక్టర్ తో సినిమాలు చేయాలి అనుకుంటున్నారు.ఈ మధ్యకాలంలో బాలీవుడ్ సినిమాల కంటే ఎక్కువగా సౌత్ లో చేసే సినిమాలే హిట్ అవ్వడంతో బాలీవుడ్ భామలు అందరూ సౌత్ లో రాణించాలి అనుకుంటున్నారు. అలా ఇక్కడి హీరోయిన్లు అక్కడికి, అక్కడి హీరోయిన్లు ఇక్కడ రాణించాలి అని తెగ ఆరాటపడుతున్నారు.ఈ నేపథ్యంలోనే బాలీవుడ్లో అందరూ హీరోయిన్లు ఆసక్తి చూపినట్టే కత్రినా కైఫ్ కూడా మళ్ళీ తెలుగులోకి రావాలని చూస్తుందట.

ఇక కత్రినా కైఫ్ సినీ ఇండస్ట్రీ లోకి బూమ్ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చాక ఆ తర్వాత తెలుగులో వెంకటేష్ తో మల్లేశ్వరి సినిమా చేసింది.అలాగే బాలకృష్ణతో అల్లరి పిడుగు మూవీలో కూడా నటించింది. ఇక అల్లరి పిడుగు సినిమా రిజల్ట్ పక్కన పెడితే మల్లీశ్వరి సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ అయింది.కానీ ఆ తర్వాత కత్రినా కైఫ్ పూర్తిగా బాలీవుడ్ కే పరిమితమైంది. అయితే మళ్లీ ఇప్పుడు కత్రినా కైఫ్ కి తెలుగు ఇండస్ట్రీపై ఇంట్రెస్ట్ పెరుగుతుందని,ఒక మంచి కథ దొరికితే టాలీవుడ్ హీరో తో నటించాలి అని భావిస్తున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు అతి త్వరలోనే ఓ పాన్ ఇండియా మూవీలో హీరోయిన్ గా నటించాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది

మరింత సమాచారం తెలుసుకోండి: