న్యాచురల్ స్టార్ నాని ఇప్పుడు ఎక్కడ చూసినా సరే ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు అభిమానులు . మరీ ముఖ్యంగా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన పర్సన్ ఇంత పెద్ద హీరో అవుతారు అని ఎవరు అనుకోలేదు . అంతేకాదు వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా హీరో అవుతారు అంటే భయపడి పోయేవారట.  ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీ రంగంలో నిలదుకోవడం చాలా చాలా కష్టమైన పని అనే అభిప్రాయం అందరికీ ఉంటుంది . అయితే మొదటి నుంచి మొండి ధైర్యంతో ముందుకు వెళ్తున్న నాని ఫైనల్లీ తాను అనుకున్న ప్లేస్ ను దక్కించుకున్నాడు . ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి తన టాలెంట్ తో పెద్ద రేంజ్ కి ఎదిగి తన పేరు చెప్పుకుని నలుగురు ఇండస్ట్రీలోకి వచ్చేలా మారారు నాని .

కాగా నాని అండ్ తో దర్శకురాలిగా కూడా మారిన సోదరీ దీప్తి రీసెంట్ గా బయటపెట్టిన విషయం ఇప్పుడు హైలైట్ గా మారింది . రీసెంట్ గా నే నాచురల్ స్టార్ నాని హిట్ 3 సినిమాతో సూపర్ డూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు . ఈ సినిమా సక్సెస్ మీట్ లో తన పర్సనల్ విషయాలు కూడా షేర్ చేసుకున్నారు . తన కుటుంబ సభ్యుల మీద సరదాగా సర్టైర్లు వేస్తూ హిట్ త్రీ లో నాని ఒక డైలాగ్ కూడా చెప్పాడు.  నాని చేతుల్లో ఒక అమ్మాయి చనిపోతుంది ఆ టైంలో " నువ్వు ఇక్కడ సర్వైవ్ అవ్వ లేవు" అంటూ నానికు వార్నింగ్ ఇస్తుంది .

దానికి బదులుగా కెరియర్ మొదటి నుంచి ఈ మాట వింటూనే ఉన్నాను అంటూ నాని ఒక భారీ డైలాగ్ చెప్తాడు . నిజానికి ఈ డైలాగ్ తన నిజ జీవితంలో ఎన్నో సార్లు విన్నారట.  ఇదే విషయాన్ని వాళ్ళ సిస్టర్ కన్ఫామ్ చేసింది.  ఈ సినిమా విషయంలో నేను ఎక్కువగా ఇన్వాల్వ్ కాలేకపోయాను.. కోర్టు సినిమా పనిలో బిజీగా ఉన్నాను .. అందుకే ఈ సినిమా బాధ్యతలను వేరే వ్యక్తి చూసుకున్నారు.. అయితే ఈ సినిమా ట్రైలర్ లో మీరు చూసిన సర్వైవ్ అవ్వలేరు అనే డైలాగ్ ముందు నుంచి నేను నానితో ఎప్పుడు చెబుతూ ఉంటాను. నేను మా అమ్మ నాన్న.. నాని సినిమాలకు దూరంగా ఉండమని చెప్పే వాళ్లము.. ఆ టైంలో సర్వైవ్ అవ్వలేవు అంటూ అనే వాళ్ళు ..కానీ ఈరోజు అతను ఇక్కడ సర్వైవ్ కావడమే కాదు వేరే వాళ్లకు రోల్ మోడల్ గా తయారయ్యాడు ..నాని చూసి నిజంగా చాలా చాలా గర్వపడుతున్నాను అంటూ దీప్తి ఓ రేంజ్ లో నాని ను పొగిడేసింది". నిజమే నాని లైఫ్ అందరికీ ఇన్స్పిరేషన్ చాలా చాలా పక్కాగా తన లైఫ్ని ప్లాన్ చేసుకొని సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్తున్నాడు..!
 

మరింత సమాచారం తెలుసుకోండి: