సమంత అంటే కొంతమంది పొగిడేస్తారు . మరి కొంతమంది బూతులు తిడుతూ ఉంటారు . కానీ ఒకప్పుడు సమంత అంటే ఎక్కువ శాతం జనాలు ఆమెని ఇష్టపడేవారు.  లైక్ చేసేవారు . నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత అక్కినేని ఫ్యామిలీ ని లైక్ చేసే జనాలు కూడా సమంతని దేవతల భావించడం మొదలుపెట్టారు.  కానీ ఏ బంధం ఎక్కువ కాలం నిలవాలి అని కోరుకుంటారో అదే బంధం పెటాకులు అయిపోతూ ఉంటుంది.  సమంత - నాగచైతన్య కూడా అలాగే విడాకులు తీసుకున్నారు . అయితే విడాకుల తర్వాత నాగచైతన్య ఎంత నెగిటివిటి ఫేస్ చేశారో అనే విషయం పక్కనపెడితే సమంత మాత్రం జనాలు చేత బూతులు తిట్టించుకుంది .


మరీ ముఖ్యంగా ఆమెకు వేరే వాళ్ళతో ఎఫైర్ ఉందని ..కొందరు పిల్లలు పుట్టలేదు అని .. కొందరు సమంత ఈగో కారణంగానే విడాకులు తీసుకుంది అని మరి కొందరుఇంకోలా రకరకాలుగా మాట్లాడుకున్నారు . అవన్నీ సమంత పెద్ద పట్టించుకోలేదు . తన పని తాను చేసుకుంటూ వచ్చింది. అయితే సమంత లైఫ్ కి మరో ఎదురు దెబ్బ తగిలింది . తన తండ్రి మరణించాడు.  సమంతకి తన తండ్రి అంటే ఎంత ఇష్టమో అందరికీ తెలుసు . కాగా సమంత తండ్రి మరణించిన సరే ఆమె తన సినిమా విషయాల్లో మాత్రమే ఎక్కడ వెనకడుగు వేయలేదు.



మరీ ముఖ్యంగా రీసెంట్గా శుభం సినిమాని ప్రొడ్యూస్ చేసింది సమంత . ఈ మూవీ థియేటర్స్ రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ టాక్ అందుకుంది. ఇదే క్రమంలో సమంత వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ తన పర్సనల్ లైఫ్ కి సంబంధించిన విషయాలు కూడా బయటపెట్టింది.  మరీ ముఖ్యంగా తన తండ్రి చనిపోయినప్పుడు తన వద్దకు వచ్చిన అభిమానుల కోసం నవ్వుతూ ఫోటోలు దిగాను అన్న విషయాన్ని బయట పెట్టింది . తాజాగా ఓ ఇంటర్వ్యూలో సమంత షాకింగ్ కామెంట్స్ చేసింది .



"అభిమానులు నా దగ్గరికి ఫోటోలు కోసం వచ్చినప్పుడు నో చెప్పలేకపోయాను ..చెన్నైలో నా తండ్రి అంతక్రియలు ఆ టైంలో నేను ఎంత బాధ పడుతూ ఉంటాను అనేది అందరికీ తెలుసు కానీ అభిమానులను నా దగ్గరికి వచ్చినప్పుడు నవ్వుతూ ఫోటోలకి ఫోజులు ఇచ్చాను.. బాధని దిగ  మింగుకొని అలా ఫోటోలకి ఫోజులు ఇచ్చాను ..ఎందుకంటే అభిమానుల వల్లే నేను ఇప్పుడు ఇంతలా ఈ స్థాయిలో ఉన్నాను .. నా విజయానికి కారణం నా అభిమానులే " అంటూ చెప్పుకు వచ్చింది . దీంతో సోషల్ మీడియాలో సమంత మాట్లాడిన మాటలు వైరల్ గా మారాయి..!

మరింత సమాచారం తెలుసుకోండి: